హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర : ఇద్దరి అరెస్ట్

  • Published By: chvmurthy ,Published On : April 1, 2020 / 05:31 AM IST
హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర : ఇద్దరి అరెస్ట్

Updated On : April 1, 2020 / 5:31 AM IST

దేశవ్యాప్తంగాలాక్ డౌన్ అమలవుతున్నవేళ.. ప్రశాంతంగా ఉన్న  హైదరాబాద్ లో అల్లర్లు  సృష్టించేందుకు ఇద్దరు యువకులు పన్నిన కుట్రను పోలీసుల చేధించారు. నగరంలోని రియాసత్ నగర్ కు చెందిన హర్షద్, బాబానగర్ కు చెందిన అబ్దుల్ వసీ ..ఇద్దరూ చిన్నప్పటి స్నేహితులు. ఇటీవల ఢిల్లీలోజరిగిన కొన్ని అల్లర్ల వీడియోలు చూసిన వీరు  హైదరాబాద్ లో కూడా అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేశారు. 

అందులో భాగంగా ఇటీవల మాదన్న పేట ప్రాంతంలో  ఓ వర్గానికి చెందిన ప్రార్ధనా మందిరం వద్ద విధ్యంసకర చర్యలకు ప్రయత్నించారు. అంతకు ముందు కంచన్ బాగ్  పోలీసు స్టేషన్ పరిధిలో  బస్సుకు నిప్పు పెట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటనలతో  అప్రమత్తమైన సౌత్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సీసీ టీవీ ఫుటేజి ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యలు చేప్టటారు.  

ఈ దుశ్చర్యలకు పాల్పడింది హర్షద్‌, అబ్దుల్‌వాసీ అని  గుర్తించి నిందితులను అరెస్టు చేశారు. మాదన్నపేట్‌, కంచన్‌బాగ్‌ ఘటనలతోపాటు చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఒక  ఏటీఎంను కూడా ధ్వంసం చేసినట్టు నిందితులు పోలీసుల విచారణలో ఒప్పుకొన్నారు. 

Also Read | సమయం లేదు మిత్రమా, ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చిన వారిని గుర్తించేందుకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌