Uttar Pradesh: నోట్ల కట్టలతో ఫొటోకి ఫోజిచ్చిన భార్య, కొడుకు, కూతురు.. చిక్కుల్లో పడ్డ పోలీసు అధికారి
రమేష్ చంద్ర కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వెంటనే సోషల్ మీడియాలోకి ఎక్కింది. 500 రూపాయల నోట్ల కట్టల పక్కన రమేష్ చంద్ర భార్య, పిల్లలు ఫోజులు ఇస్తూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం.. 14 లక్షల రూపాయల విలువైన భారీ నగదు ఉంటుందని అంచనా వేశారు.

Uttar Pradesh: భార్య, కూతురు, కొడుకు.. నోట్ల కట్టలు బెడ్ మీద పెట్టి ఫొటోలు తీసుకోవడంతో ఒక పోలీసు అధికారి చిక్కుల్లో పడ్డాడు. ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సదరు పోలీసు అధికారిపై విచారణ ప్రారంభమైంది. అయితే తన ఆస్తులు అమ్మడం వల్ల ఆ డబ్బు వచ్చిందని, దానితోనే తమ కుటుంబ సభ్యులు ఫొటో తీసుకున్నారని వివరణ ఇచ్చుకున్నాడు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నావ్‌లో ఉన్న ఒక పోలీస్ స్టేషన్ ఇంచార్జి రమేష్ చంద్రకు ఎదురైన చేదు అనుభవం ఇది.
రమేష్ చంద్ర కుటుంబ సభ్యులు తీసుకున్న సెల్ఫీ వెంటనే సోషల్ మీడియాలోకి ఎక్కింది. 500 రూపాయల నోట్ల కట్టల పక్కన రమేష్ చంద్ర భార్య, పిల్లలు ఫోజులు ఇస్తూ తీసుకున్న సెల్ఫీ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. దాని ప్రకారం.. 14 లక్షల రూపాయల విలువైన భారీ నగదు ఉంటుందని అంచనా వేశారు. నోట్ల కట్టలతో ఉన్న అధికారి ఫోటో వైరల్ అయిన వెంటనే, రమేష్ చంద్రపై సీనియర్ పోలీసు అధికారి వెంటనే విచారణకు ఆదేశించారు.
Mayawati: ముస్లిం రిజర్వేషన్లపై మీ నిజాయితీని నిరూపించుకోండి.. ప్రభుత్వాలు మాయావతి సూచన
అయితే, రమేష్ చంద్ర సహాని తనను తాను సమర్థించుకున్నారు. ఫోటో నవంబర్ 14, 2021న తీసిందని, తన కుటుంబ ఆస్తిని విక్రయించినప్పుడు వచ్చిన డబ్బుతో తీసిన ఫొటో అని వివరణ ఇచ్చుకున్నారు. ఈ సంఘటనకు సంబంధించి ఒక సీనియర్ పోలీసు అధికారి వివరాలను తెలియజేస్తూ “స్టేషన్-హౌస్ ఆఫీసర్ కుటుంబానికి చెందిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది నోట్ల కట్టల చుట్టూ పోలీసు భార్య, పిల్లలు ఉన్నారు. మేము ఈ విషయాన్ని గుర్తించాము. సదరు అధికారిని పోలీసు లైన్‌కు బదిలీ చేసి దర్యాప్తు చేస్తున్నాం” అని అన్నారు.