Vanama Raghava : వనమా రాఘవపై 12 కేసులు-రిమాండ్ రిపోర్ట్‌లో తెలిపిన పోలీసులు
భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వర రావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో అతని పై ఉన్న కేసులకు సంబందించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు.

Vanama Raghava
Vanama Raghava : భద్రాద్రి జిల్లా కొత్తగూడెం ఎంఎల్ఎ వనమా వెంకటేశ్వర రావు కొడుకు వనమా రాఘవ రిమాండ్ రిపోర్టులో అతని పై ఉన్న కేసులకు సంబందించిన వివరాలను పోలీసులు కోర్టుకు సమర్పించారు. రాఘవపై ప్రస్తుతం 12 కేసుూలుల ఉన్నాయని… ఆత్మహత్యకేసులో ముందస్తు బెయిల్ లో ఉన్నాడని పోలీసులు పేర్కోన్నారు.
బాధితుడు రామకృష్ణ….. బాస్ నన్ను క్షమించు అంటు స్నేహితులకి రాసిన సూసైడ్ లేఖ వివరాలను కూడా పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. సూసైడ్ వీడియో లను వైరల్ చేయమని బాధితుడు రామకృష్ణ స్నేహితులకు చెప్పాడు.
నిందితుడు వనమా రాఘవపై కొత్తగూడెం నియోజకవర్గంలోని మూడు పోలీసుస్టేషన్లలో కేసులున్నట్లు పోలీసులు తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ టౌన్, పాల్వంచ రూరల్, లక్ష్మీ దేవి పల్లి పోలీసుస్టేషన్లలో ఉన్న కేసుల వివరాలను పోలీసులు రిమాండ్ రిపోర్టులో పొందు పర్చారు. ఈ కేసులలో పాల్వంచ టౌన్లో అయిదు కేసులు, మరో రెండు కేసులు పాల్వంచ రూరల్ ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు.
Also Read :Indigestion Problems : అజీర్ణ సమస్యలకు అద్భుతమైన చిట్కాలు
అదే విదంగా కొత్తగూడెం త్రీ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో మరో మూడు కేసులు, లక్ష్మీదేవిపల్లిలో ఒక కేసు నమోదు అయ్యింది. కాగా ఇప్పుడు పాల్వంచ టౌన్లో మారో కేసు నమోదు అయ్యింది. మొత్తం 12 కేసులు రాఘవ పై నమోదు అయ్యాయని రిమాండు రిపోర్టు లో పోలీసులు పేర్కోన్నారు.