Vizag Tahsildar Murder : విశాఖలో అర్ధరాత్రి దారుణం.. తహసీల్దార్ హత్య.. ల్యాండ్ మాఫియా పనేనా?
విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చినగదిలి రూరల్ తహసీల్దార్ రణమయ్య దారుణ హత్యకు గురయ్యాడు.

MRO Ramanaiah
Tahsildar Ramanaiah : విశాఖలో దారుణం చోటు చేసుకుంది. చినగదిలి రూరల్ తహసీల్దార్ రణమయ్య దారుణ హత్యకు గురయ్యాడు. కొమ్మది చరణ్ క్యాస్టిల్ అపార్ట్ మెంట్ గేటు ముందే గుర్తు తెలియని వ్యక్తులు తహసీల్దార్ పై రాడ్లతో దాడి చేశారు.. దీంతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. చికిత్స నిమిత్తం స్థానికులు ఆస్పత్రి తరలించారు.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య మరణించాడు.
Also Read : BYJUS: బైజూస్ ఉవ్వెత్తున ఎగిసి.. ఇంతలా ఎందుకు పడిపోయింది? నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటి?
తహసీల్దార్ రమణయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు (పాప, బాబు) ఉన్నారు. రమణయ్య సొంతూరు శ్రీకాకుళం జిల్లా మండలం దిమ్మిలాడ గ్రామం. విధుల్లో చేరి పదేళ్లు అవుతుంది. డిప్యూటీ తహసీల్దార్, తహసీల్దార్, కలెక్టరేట్ లో ఏవోగా రమణయ్య పనిచేశారు. ఎన్నికల నేపథ్యంలో రెండురోజుల క్రితం విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ అయ్యారు. మొదటిరోజు విధులకు హాజరై రాత్రి 8గంటల సమయంలో రమణయ్య ఇంటికి చేరుకున్నారు. రాత్రి సుమారు 10.15 గంటల సమయంలో ఫోన్ రావడంతో ప్లాట్ నుంచి కిందకు వెళ్లిన తహసీల్దార్ రామణయ్య ఓ వ్యక్తితో పది నిమిషాల పాటు సీరియస్ గా సంభాషణ చేశాడు. గుర్తుతెలియని వ్యక్తి తనవెంట తెచ్చుకున్న ఇనుప రాడ్ తో తలపై బలంగా కొట్టడంతో రమణయ్య అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు.
Also Read : AP Politics: టీడీపీలోకి వైసీపీ సిట్టింగ్‌లు.. తెలుగు దేశం పార్టీ నేతల గుండెల్లో రైళ్లు..
రక్తపు మడుగులో పడిఉన్న రమణయ్యను వెంటనే అపోలో హాస్పిటల్ కు చికిత్స నిమిత్తం బంధువులు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ రమణయ్య కన్నుమూశాడు. కొమ్మాదిలోని ఎస్టీబీఎల్ సినీ థియేటర్ వెనక ఉన్న చరణ్ క్యాస్టల్స్ అపార్ట్ మెంట్లోని ఐదో అంతస్తులో రమణయ్య నివాసం ఉంటున్నాడు. ల్యాండ్ సమస్యకు సంబంధించి ఈ గొడవ జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు నిందితులకోసం ప్రత్యేక గాలింపు చర్యలు చేపట్టారు. తహసీల్దార్ హత్యతో రెవెన్యూ యంత్రాంగం ఉలిక్కిపడింది.