ప్రియుడ్ని వదల్లేక.. ప్రియుడితో కలిసి భర్తను….

  • Published By: chvmurthy ,Published On : March 20, 2020 / 10:02 AM IST
ప్రియుడ్ని వదల్లేక.. ప్రియుడితో కలిసి భర్తను….

Updated On : March 20, 2020 / 10:02 AM IST

ప్రేమించినవాడ్ని పెళ్ళి చేసుకోలేక, పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుని భర్తతో సఖ్యంగా ఉండలేక, ప్రేమించిన ప్రియుడితో ఎపైర్ కొనసాగించింది ఓ ఇల్లాలు. తీరా విషయం భర్తకు తెలిసి మందలించే సరికి భర్తను అడ్డు తొలగించుకోవాలనుకుంది. ప్రియుడితో కలిసిప్లాన్ చేసి భర్తను అంతమొందించింది. 

అనంతపురం జిల్లా యాడికి మండలం నందలపాడుకు చెందిన శేఖర్ కు నాగమ్మ అనే మహిళతో వివాహం అయ్యింది.  వీరికి ఒక కుమారుడు,కుమార్తె ఉన్నారు. శేఖర్ ఆటోలో మినరల్ వాటర్ సప్లయ్ చేస్తూ  జీవనం సాగిస్తున్నాడు. నాగమ్మ బంధువు వరసకు బావ అయిన కత్తిమానుపల్లికి చెందిన బలరాముడు  కూడా ఆటో నడుపుతూ ఉంటాడు.

శేఖర్ తో పెళ్లికి ముందు నాగమ్మ బలరాముడిని పెళ్లి చేసుకోవాలనుకుంది కానీ కుదరలేదు. ఇంట్లో పెద్దవాళ్ళు నాగమ్మను శేఖర్ కు ఇచ్చిన పెళ్లి చేశారు. పెళ్లైన తర్వాత  నాగమ్మ బావ బలరాముడితో అక్రమ సంబంధం కొనసాగించింది. కొన్నాళ్లకు ఈ విషయం భర్త శేఖర్ కు తెలిసింది.  కోపం పట్టలేని శేఖర్ నాగమ్మను చితక్కోట్టాడు.  దీంతో భర్తను అడ్డుతొలిగంచుకోవాలనుకుంది నాగమ్మ. ఈ విషయాన్ని ప్రియుడు బలరాముడు కు చెప్పింది.  ఇద్దరూ కల్సి ప్లాన్ చేశారు. (Youtubeలో చూస్తూ గర్ల్‌ఫ్రెండ్‌కు డెలీవరీ.. శిశువు మృతి, తల్లి పరిస్థితి విషమం)

తనకు ఒంట్లో  బాగుండటం లేదని  ఓబులేసుకోనలోని పెద్దమ్మ గుడికి వెళ్లి పూజచేయించుకు వద్దామని భర్తను ఒప్పించింది. బుధవారం మార్చి 18 ఉదయం ఇద్దరూ కల్సి బైక్ మీద గుడికి బయలుదేరారు.  ఆవులతిప్పాయిపల్లి గ్రామ సమీపంలోకి రాగానే బండిని ఆపమంది నాగమ్మ.

అప్పటికే వారిని ఫాలో అయి వస్తున్న బలరాముడు అక్కడికి చేరుకన్నాడు. క్రికెట్ బ్యాట్ తో శేఖర్ తలపై బలంగా కొట్టటంతో  తీవ్ర రక్త స్రావం కావటంతో అక్కడిక్కడే పడి చనిపోయాడు. శేఖర్ మరణించాడని నిర్ధారించుకుని  బైక్ ను అక్కడే వదిలేసి నాగమ్మ, బలరాముడు అక్కడి నుంచి పరారయ్యారు.  

ఈ  హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీరించాలని ప్రయత్నించారు.   పోలీసు విచారణలో అక్కడి పొదల్లో  రక్తపు మరకలతో పడివున్న  బ్యాట్ ఆధారంగా, శేఖర్ అక్క ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.  నాగమ్మ, బలరామ్ లను  అదుపులోకి తీసుకుని హత్యకు ఉపయోగించిన బ్యాట్, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. హత్య జరిగిన 24 గంటల్లోనే  పోలీసులు కేసును చేధించి నిందితులను  అరెస్టు  చేసారు.