భర్తను చంపి పడక గదిలో పాతిపెట్టిన భార్య

ఓ భార్య తన భర్తను చంపి శవాన్ని తన ఇంట్లోని బెడ్ రూమ్ లో పాటి పెట్టిన ఘటన త్రిపుర జిల్లాలో కలకలం రేపింది. దాలియా జిల్లా భక్తికుమ్ పురాలో నివాసం ఉండే 21 ఏళ్ల మహిళ భారతి తన భర్త సంజిత్ రియాంగ్(30) నుంచి హత మార్చింది. ఆ తర్వాత గుట్టు చప్పుడు కాకుండా శవాన్ని బెడ్ రూమ్ లో మట్టి తీసి పాతి పెట్టింది. అనంతరం సమీపంలోని గ్రామానికి పారిపోయింది.
సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఆ ఇంటికి వచ్చారు. లోపలికి వెళ్లి మట్టిని తవ్వి డెడ్ బాడీని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితురాలు ఉంటున్న గ్రామానికి వెళ్లారు. ఆమెని అరెస్ట్ చేశారు.
దంపతులు తరుచూ గొడవ పడే వారని పోలీసుల విచారణలో తెలిసింది. ఏదో ఒక విషయంపై ఇద్దరూ తరుచుగా ఘర్షణ పడేవారని స్థానికులు చెప్పారు. ఈ క్రమంలోనే తన భర్తను భార్య చంపి ఉండొచ్చని పోలీసులు చెబుతున్నారు. దీనిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు. హత్యకు కారణం ఏంటో తెలుసుకుంటామన్నారు. కాగా, నిందితురాలికి కరోనా టెస్టు చేయగా, పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. దీంతో ఆమెని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.