పిల్లలను పట్టించుకోరని హత్య చేసిన తల్లి

పిల్లలను పట్టించుకోరని హత్య చేసిన తల్లి

Updated On : November 2, 2019 / 5:40 AM IST

తన తర్వాత పిల్లలను చూసే వారుండరేమోననే భయంతో కన్న ప్రేమే ప్రాణాలు తీసేలా చేసింది. చాంద్రాయణగుట్ట హాఫిజ్ బాబానగర్‌లో తల్లి ఇద్దరు పిల్లలను చంపిన కేసు చిక్కుముడి వీడింది. శుక్రవారం అక్టోబర్ 26న జరిగిన ఘటనపై పలు రకాల కోణంలో దర్యాప్తు చేపట్టారు. తల్లి ఫర్హాత్ బేగం ఆరోగ్యం పదిహేను రోజులుగా బాగా లేదు. తను చనిపోతానని నమ్మింది. 

తాను చనిపోయిన తర్వాత భర్త పిల్లలను మంచిగా చూసుకోడని ఊహించుకుంది. దాంతో పిల్లలను తనే చంపాలని డిసైడ్ అయింది. పోలీసులు చేపట్టిన దర్యాప్తు కారణంగా తనే పిల్లలను చంపిందనే  నిజం వెలుగులోకి వచ్చింది. ఇన్ స్పెక్టర్ జి.వెంకటరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం ఫరూక్ బేగం పిల్లలను చంపిందని నేరాన్ని అంగీకరించింది.

ఇద్దరు పిల్లలు నేహా జబీన్ (15), మహమ్మద్ అబ్దుల్ అజీద్ (14) చంపిన వెంటనే తాను కూడా చనిపోవాలని నిర్ణయించుకుంది. శుక్రవారం(అక్టోబర్ 26)న రాత్రి పిల్లలకు నిద్ర మాత్రలు ఇచ్చింది. మత్తులో జారుకున్న తర్వాత కొద్దిసేపటి వారికి ఇన్సులిన్ ఇంజక్షన్ చేసింది. అప్పటికి చనిపోకపోతే వారి గొంతులను నులిమి చంపిందని ఇన్‌స్పెక్టర్ తెలిపారు. పూర్తి విచారణ కోసం నవంబర్ 1న నిందితురాలిని రిమాండ్‌కు తరలించారు.