వివాహేతర సంబంధం : పాముతో కాటువేయించి అత్తను చంపిన కోడలు

రాజస్తాన్ లో దారుణం చోటుచేసుకుంది. ఇంట్లో నిద్రిస్తున్న అత్తని పాముతో కాటువేయించి చంపిన కోడలు. ఈ ఘటన రాజస్తాన్ లోని జున్ జున్ జిల్లాలో గతేడాది (జూన్ 2, 2019)న జరుగింది. ఈ ఘటన తాజాగా వెలుగులోకి రావడంతో.. నిందితులను ఈ నెల(జనవరి 4, 2020)న అరెస్ట్ చేశారు.
అసలేం జరిగిందంటే.. రాజస్తానన్ లోని జునుజ్జును జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన సుబోధ్ దేవి కోడలు అల్పనాతో కలిసి నివాసం ఉంటుంది. అల్పనా భర్త భారత సచిన్ సైన్యంలో పని చేస్తున్నారు. వారిద్దరికి (డిసెంబర్ 12, 2018)లో పెళ్ళి చేసుకున్నారు. అయితే సచిన్ సైన్యంలో పని చేస్తూ.. కుటుంబానికి దూరంగా ఉన్నారు. దీంతో అల్పనాకు జైపూర్‌కు చెందిన మనీష్ తో వివాహేతర సంబంధం ఏర్పడింది. వారు పదే పదే ఫోన్లు మాట్లాడుకోవడం గమనించిన సుబోధ్ దేవి.. కోడలును ప్రశ్నించింది.
దీంతో తన వివాహేతర సంబంధం ఎక్కడ బయటపడుతుందో అని భయపడి అత్తను చంపాలని ప్లాన్ చేసింది. అనంతరం ప్రియుడికి ఫోన్ చేసి జరిగిన విషయం చెప్పి.. ఎవరూ ఊహించని విధంగా అత్త ను హత్య చేసేందుకు ప్లాన్ చేశారు. జూన్ 2, 2019 న వారు సుబోధ్ దేవిని పాము కాటుతో చంపారు. అయితే అల్పానా అత్త తరుపు బంధువులకు ఆమెపై అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అంతేకాదు అల్పనా, మనీష్ మాట్లాడుతుకున్న ఫోన్ నంబర్లను కూడా పోలీసులకు ఇచ్చారు. హత్య జరిగిన రోజు రెండు నంబర్ల మధ్య 124 కాల్స్, అల్పనా, మనీష్ స్నేహితుడు కృష్ణ కుమార్ మధ్య 19 కాల్స్ వచ్చాయి. కొన్ని మెసేజ్‌లు కూడా ముగ్గురి మధ్య షేర్ అయ్యాయి. విచారణ చేపట్టిన పోలీసులు.. అల్పనా, మనీష్ తో పాటు కృష్ణ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు.