రూ.1.75 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

  • Published By: veegamteam ,Published On : January 8, 2019 / 08:18 AM IST
రూ.1.75 కోట్ల విలువైన ఎర్రచందనం పట్టివేత

నెల్లూరు : జిల్లాలో తరచుగా ఎర్రచందనం పట్టుబడుతోంది. భద్రతను ఎంత కట్టుదిట్టం చేసినా స్మగ్లర్లు ఎర్రచందనం స్మగ్లింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. అడువుల్లో ఎర్రచందనం దుంగలను నరికివేసి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఎర్రచందనం అమ్మి కోట్లు గడిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో తాజాగా భారీగా ఎర్రచందనం పట్టుబడింది. అక్రమంగా తరలిస్తున్న రూ.1.75 కోట్ల విలువైన ఎర్రచందనాన్ని పోలీసులు సీజ్ చేశారు.

డక్కిలి సమీపంలోని అడువుల్లో 10 మంది స్మగ్లర్లను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి 12 సెల్ ఫోన్లు, 6 బైకులు, వ్యాన్, 8.5 కేజీల ఎర్రచందనం పొడి, రెండు యంత్రాలు, రూ.2100, పలు మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నారు. చెన్నై, ముంబై, కొచ్చి, కాండ్లా ప్రాంతాల మీదుగా చైనాకు ఎర్రచందనం తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.