5 ఏళ్ల బాలికను అత్యాచారం చేసి బావిలో పడేశాడు…చనిపోయిందనుకున్న పాప, దారుణాన్ని చెప్పడానికి బైటకొచ్చింది

చత్తీస్ ఘడ్ లో దారుణం జరిగింది. 5 ఏళ్లబాలికపై 17 ఏళ్ళబాలుడు అత్యాచారం చేసి బావిలోకి విసిరేశాడు. అత్యాచారం చూశాడని బాలిక బంధువు 6 ఏళ్లబాలుడిని గొంతుకోసి చంపేశాడు.
చత్తీస్ ఘడ్ లోని కోరియా జిల్లాలోని ఒక గ్రామంలో కొందరు పిల్లలు సమీపంలోని అటవీ ప్రాంతంలో ఆడుకుంటున్నారు. ఆసమయంలో పూజకు కావాల్సిన పూలు, ఆకులు కోసం ఓ 17 ఏళ్ళ యువకుడు ఆ ప్రాంతంలోకి వచ్చాడు. పూలు, ఆకులు కోయటానిక తనకు సహాయం చేయమని అక్కడ ఆడుకుంటున్న పిల్లల్ని కోరాడు.
అతడు తెలిసిన వాడే అవటంతో 5 ఏళ్ల బాలిక, ఆమెకు బంధువైన 6 ఏళ్ళబాలుడు అతని వెంట వెళ్ళారు. ఆ యువకుడు వారిద్దరిన కొంత దూరం తీసుకువెళ్లి పూలు ఏరసాగాడు. 5 ఏళ్ల బాలికను ఇంకొంత దూరం నిర్మానుష్యంగా ఉన్న ప్రదేశంలోకి తీసుకు వెళ్లి అక్కడ ఆమెపై అత్యాచారం చేశాడు. ప్రతిఘటించిన బాలికను గాయపరిచి ఆమెపై పశువులా ప్రవర్తించాడు.
ఆమెను కొట్టి తన పశువాంఛ తీర్చుకున్నాడు. బాలికపై అత్యాచారం చేసి మళ్లీ గ్రామంలో చెపుతుందనే భయంతో ఆమెను చంపాలని సమీపంలోని లోతైన బావిలో పడేసి ఊళ్ళోకి రాబోయాడు. ఈ తతంగం మొత్తం వారి వెంట వచ్చిన 6 ఏళ్ల బాలుడు చూశాడు. ఆబాలుడు సాక్ష్యం చెపుతాడనేభయంతో గొంతుకోసి హత్యచేసిపొదల్లోవిసిరి గ్రామంలోకి వచ్చాడు.
బావిలో పడిన బాలికకు తీవ్ర గాయాలయ్యాయి. అదృష్టవశాత్తు బాలిక మునిగిపోకుండా పైకితేలుతూ సహాయం కోసం కేకలు పెట్టింది. కొంత సేపటికి అటుగా వచ్చిన ఒక వ్యక్తి బాలిక కేకలు విని కొందరు గ్రామస్తులను పిలుచుకు వచ్చి వారి సహాయంతో బాలికను పైకి తీసి రక్షించారు.
బాలికను గ్రామం లోనికి తీసుకు వస్తుండగా, పొదల్లో హత్య చేసిన బాలుడి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. బాలుడు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాలిక తనపై జరిగిన అత్యాచారాన్ని వివరించింది. బాలిక చెప్పిన ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు.