మనిషేనా : యాక్సిడెంట్ లో యువతి చనిపోతే సెల్ఫీ తీసుకున్నాడు

సెల్ఫీ పిచ్చి పీక్స్ కి చేరింది. సెల్ఫీల మోజులో పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. చిన్న, పెద్ద.. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు.. ఇలా అందరూ అదే పని చేస్తున్నారు. కొందరు

  • Published By: veegamteam ,Published On : November 27, 2019 / 02:23 AM IST
మనిషేనా : యాక్సిడెంట్ లో యువతి చనిపోతే సెల్ఫీ తీసుకున్నాడు

Updated On : November 27, 2019 / 2:23 AM IST

సెల్ఫీ పిచ్చి పీక్స్ కి చేరింది. సెల్ఫీల మోజులో పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. చిన్న, పెద్ద.. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు.. ఇలా అందరూ అదే పని చేస్తున్నారు. కొందరు

సెల్ఫీ పిచ్చి పీక్స్ కి చేరింది. సెల్ఫీల మోజులో పిచ్చోళ్లుగా మారిపోతున్నారు. చిన్న, పెద్ద.. చదువుకున్న వాళ్లు, చదువుకోని వాళ్లు.. ఇలా అందరూ అదే పని చేస్తున్నారు. కొందరు మనుషులు.. మానవత్వాన్ని సైతం మర్చిపోతున్నారు. విచక్షణ కోల్పోయి సభ్య సమాజం సిగ్గుపడేలా చేస్తున్నారు. ఆఖరికి యాక్సిడెంట్ స్పాట్ లో, విషాద వాతావరణంలో, మృతదేహాల పక్కన నిలబడి మరీ సెల్ఫీలు తీసుకుంటున్న వైనం బాధ కలిగిస్తోంది.

మంగళవారం(నవంబర్ 26,2019) హైదరాబాద్ బంజారాహిల్స్ లో రోడ్డు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. రోడ్ నెంబర్ 12లో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో స్కూటీపై ప్రయాణిస్తున్న యువతి తలపై నుంచి బస్సు వెళ్లడంతో ఆమె స్పాట్ లోనే చనిపోయింది. దీంతో ఆగ్రహించిన జనం తాత్కాలిక బస్సు డ్రైవర్‌పై దాడికి దిగారు. నిర్లక్ష్యంగా బస్ నడిపిన తాత్కాలిక ద్రైవర్‌ను చితకబాదారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మృతురాలు టాటా కన్సల్టెన్సీలో పనిచేస్తున్న సోహిని సక్సేనాగా గుర్తించారు. 

ఓ వైపు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ చనిపోయి జనం కోపంలో ఉంటే.. మరోవైపు ఓ యువకుడు నీచానికి ఒడిగట్టాడు. శవం పక్కన నిలబడి సెల్ఫీ తీసుకుంటూ కెమెరాకు చిక్కాడు. ఫొటోలో తనతో పాటు మృతదేహం కూడా పడేలా చూసుకుని మరీ సెల్ఫీలు తీసుకున్నాడా యువకుడు. ఒక మనిషి ప్రాణం పోయి అంతా తీవ్ర విషాదంలో ఉంటే.. అలాంటి సమయంలోనూ అతడు సెల్ఫీ దిగడం ఆగ్రహం తెప్పించింది. ఇప్పుడీ ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ యువకుడిని నెటిజన్లు తిడుతున్నారు. అసలు నువ్వు మనిషేనా అని మండిపడుతున్నారు. మినిమమ్ కామన్ సెన్స్ లేని, కొంచెం కూడా మానవత్వం చూపని ఇలాంటి వారిని ఏం చేసినా పాపం లేదంటున్నారు.