ఇంటిదొంగలెవరు? : వివేకా హత్యతో సంబంధం లేదు – పరమేశ్వర్ రెడ్డి

  • Published By: madhu ,Published On : March 18, 2019 / 09:23 AM IST
ఇంటిదొంగలెవరు? : వివేకా హత్యతో సంబంధం లేదు – పరమేశ్వర్ రెడ్డి

Updated On : March 18, 2019 / 9:23 AM IST

* వివేకానందరెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ
* హత్యపై వెలుగులోకి రోజుకో కొత్త కోణం
* అనుమానితుడు పరమేశ్వర్ రెడ్డి ఏమంటున్నారు?
* హత్యోదంతం ఇంటిదొంగల పనేనా?
* ఆ ఇంటి దొంగలు ఎవరు?
* రాజకీయ కారణాలతోనే హత్య జరిగిందా?
* వివేకానందరెడ్డిని చంపాల్సిన అవసరం ఎవరికుంది?

మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ నేత వివేకానందరెడ్డి హత్య మిస్టరీ ఇంకా వీడడం లేదు. ఈ కేసును చేధించేందుకు సిట్ అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పలువురిని విచారిస్తున్నారు. ఈ తరుణంలో మరొక కోణం వెలుగులోకి వచ్చింది. వివేకాకు అత్యంత సన్నిహితంగా మెలిగిన పరమేశ్వర్ రెడ్డి మిస్సింగ్ కావడం కలకలం రేపుతోంది. హత్య జరిగిన అర్ధరాత్రి తరువాత ఆయన కుటుంబం ఎక్కడకు వెళ్లిపోయింది. అయితే..ఆయన అనారోగ్యం కారణంతో చిత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు మీడియాకు తెలిసింది. అక్కడకు చేరుకున్న మీడియాతో పరమేశ్వర్ రెడ్డి మాట్లాడారు. 

పులివెందుల సమీపంలోని కసనూరుకు చెందిన పరమేశ్వర్‌రెడ్డి సెటిల్‌మెంట్లు, భూ వివాదాలు పరిష్కరించేవాడు. వివేకాతో అత్యంత సన్నిహితంగా మెలిగేవాడని సమాచారం. ఇటీవల ఓ వివాదంలో పరమేశ్వర్‌తో వివేకా గొడవపడినట్లు ప్రచారం సాగుతోంది. ఈ హత్యకు పది రోజుల ముందు త్వరలో ఓ సంచలనం చూస్తారంటూ పరమేశ్వర్‌ కొందరి వద్ద మాట్లాడినట్లు తెలిసింది. ఈ హత్య తర్వాత పరమేశ్వర్‌రెడ్డి ఆయన కుటుంబం అదృశ్యమవడం వెనక పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పరమేశ్వరరెడ్డి మాత్రం హత్యతో తనకు ఎలాంటి సంబంధం లేదంటున్నాడు. వివేకా మంచి వ్యక్తి అన్న పరమేశ్వర్ ఆయన్ను దారుణంగా చంపడం బాధించిందన్నారు. ఇది ఇంటిదొంగల పనే అన్నాడు. తనకు ఆరోగ్యం సహకరించకపోవడంతో వివేకా అంత్యక్రియలకు హాజరు కాలేదని చెప్పుకొచ్చాడు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.