AFCAT 1 Notification 2024 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఆఫీసర్ ఖాళీలు… ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ పరీక్ష కు దరఖాస్తులు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 30, 2023గా నిర్ణయించారు. AFCAT కోర్సు జనవరి 2025లో ప్రారంభమవుతుంది.

IAF AFCAT 2024 notification
AFCAT 1 Notification 2024 : ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో చేరేందుకు సిద్ధమవుతున్న యువతకు ఇది గుడ్ న్యూస్. భారత వైమానిక దళం AFCAT 1 ( కామన్ అడ్మిషన్ టెస్ట్ ) నోటిఫికేషన్ విడుదలైంది. దీని ద్వారా ఆన్‌లైన్ విధానంలో ఫ్లయింగ్ , గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ మరియు నాన్-టెక్నికల్) శాఖలలో గ్రూప్ ‘A’ గెజిటెడ్ ఆఫీసర్ల ఖాళీలను భర్తీ చేయనున్నారు.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఖాళీగా ఉన్న మొత్తం 317 పోస్టులు భర్తీ చేస్తారు. ఎయిర్ ఫోర్స్ అధికారిక వెబ్‌సైట్ afcat.cdac.in/ లేదంటే careerindianairforce.cdac.in ద్వారా ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హత ;
ఫ్లయింగ్ బ్రాంచ్ అర్హతలకు సంబంధించి ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్‌లో చేరాలనుకునేవారు కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్ లో ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులు చదివి ఉండాలి. అలాగే గ్రాడ్యుయేషన్ లో ఏదైనా విభాగంలో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. లేదంటే బీటెక్ లోకనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
READ ALSO : Team India : చేజారిన కప్.. ఉబికి వచ్చిన కన్నీటిని ఆపుకోలేక..
గ్రౌండ్ డ్యూటీ అర్హతలకు సంబంధించి ఫిజిక్స్ , మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం 50% మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. ఇంజనీరింగ్,టెక్నాలజీలో 60% మార్కులతో గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎన్‌సీసీ: ఫిజిక్స్, మ్యాథ్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. దీనితో పాటు, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. కనీసం B గ్రేడ్‌తో NCC C సర్టిఫికేట్ కలిగి ఉండటం అవసరం.
జీతం ;
ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ బ్రాంచ్‌లో అధికారి అయితే నెలకు దాదాపు రూ.85,372 జీతం చెల్లిస్తారు. గ్రౌండ్ డ్యూటీ (టెక్నికల్ బ్రాంచ్)లో జీతం నెలకు దాదాపు రూ. 74,872 ఉంటుంది. గ్రౌండ్ డ్యూటీ (నాన్-టెక్నికల్ బ్రాంచ్)లో జీతం నెలకు దాదాపు రూ. 71,872 ఉంటుంది.
READ ALSO : Drinks for Weight Loss : బరువు తగ్గించటంలో సహాయపడే 7 పానీయాలు ఇవే !
దరఖాస్తు ;
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 1, 2023 నుండి ప్రారంభమవుతుంది. దరఖాస్తు చేసేందుకు చివరి తేదీ డిసెంబర్ 30, 2023గా నిర్ణయించారు. AFCAT కోర్సు జనవరి 2025లో ప్రారంభమవుతుంది.
దరఖాస్తు చేసుకునేందుకు వెబ్ సైట్ ; careerindianairforce.cdac.in లేదా afcat.cdac.in పరిశీలించగలరు.