అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ దరఖాస్తులకు మార్చి 28 ఆఖరు

  • Published By: chvmurthy ,Published On : March 21, 2019 / 04:11 AM IST
అంబేద్కర్ యూనివర్సిటీలో ఓపెన్ డిగ్రీ దరఖాస్తులకు మార్చి 28 ఆఖరు

Updated On : March 21, 2019 / 4:11 AM IST

హైదరాబాద్: బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే అర్హత పరీక్ష 2019 కి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోడానికి 2019 , మార్చి 28 చివరి తేదీ అని వర్సిటీ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్ లేదా తత్సమానమైన విద్యార్ఙతలు కలిగిన వారు  ప్రవేశం పొందాలంటే  ఈ అర్హత పరీక్షలోఉత్తీర్ణత పొందాలి.  అభ్యర్ధులకు 2019  జూలై 1 నాటికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి.  
 

దరఖాస్తులో ఇచ్చిన వివరాలను పొందుపరిచి, పాస్ పోర్టు సైజ్ పోటోను అభ్యర్ధులు అప్ లోడ్ చేయాలి. అభ్యర్ధులు రూ.300 పరీక్ష ఫీజును ఆన్ లైన్ లో చెల్లించాలి.  ఏప్రిల్ 28న ఉదయం 10 గంటల నుంచి 12-30 వరకు పరీక్ష నిర్వహిస్తారు.  తెలంగాణ, ఏపీ లోని స్టడీ సెంటర్ల లో అభ్యర్ధులు ఎక్కడైనా  పరీక్ష కేంద్రం నమోదు చేసుకోవచ్చు. ఇతర వివరాలు, ఆన్ లైన్ లో నమోదుకు యూనివర్సిటీ వెబ్ సైట్ ను సందర్సించవచ్చని అధికారులు తెలిపారు.