AP Inter Results 2025: ఏపీ ఇంటర్ పరీక్షల ఫలితాలు గ్రేడింగ్ పద్ధతిలోనా? మార్కులు ఇస్తారా?
గత సంవత్సరాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం ఎలా ఉందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. ఈ సారీ పరీక్షల ఫలితాలు గ్రేడ్ విధానంలోనే రానున్నాయి. గ్రేడింగ్ విధానం.. విద్యార్థుల మార్కుల శాతం ఆధారంగా ఏ నుంచి డీ వరకు గ్రేడ్‌లతో ఇస్తారు.
గ్రేడ్‌లు ఇలా..
- 91 నుంచి 100 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు A1 గ్రేడ్
- 81 నుంచి 90 శాతం మార్కులు సాధించిన వారికి A2 గ్రేడ్
- 71 నుంచి 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు B1 గ్రేడ్
- 61 నుంచి 70 శాతం మార్కులు సాధించిన వారికి B2 గ్రేడ్
- 51 నుంచి 60 శాతం మార్కులు సాధించిన విద్యార్థులకు C1 గ్రేడ్
- 41 నుంచి 50 శాతం మార్కులు సాధించిన వారికి C2 గ్రేడ్
- 35 నుంచి 40 శాతం మార్కులు సాధించిన వారికి డీ గ్రేడ్
Also Read: దెబ్బకు దెబ్బ.. అమెరికా 145 శాతం టారిఫ్ వేస్తే చైనా కూడా తగ్గేదే లే అంటూ.. భారీగా కౌంటర్ టారిఫ్ లు
గత సంవత్సరాల్లో మొత్తం ఉత్తీర్ణత శాతం
- 2024: 78%
- 2023: 72%
- 2022: 61%
- 2021: 100% (కరోనా వేళ)
- 2020: 59%
- 2019: 68%
- 2018: 69%
గత సంవత్సరం అత్యధిక ఉత్తీర్ణత శాతం సాధించిన జిల్లాలు
- కృష్ణా: 90 శాతం
- గుంటూరు: 87 శాతం
- ఎన్టీఆర్: 87 శాతం
- వైజాగ్: 84 శాతం
Note: రేపు ఉదయం 11 గంటలకు ఏపీ ఇంటర్ బోర్డు ఫలితాలను విడుదల చేస్తుంది.
ఏపీ ఇంటర్ రిజల్ట్స్ ను bie.ap.gov.in , results.bie.ap.gov.in లేదా www.10tv.inలో చెక్ చేసుకోండి.