AP PGECT 2025 Counselling: ఏపీ పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ మొదలు.. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్.. నోటిఫికేషన్ విడుదల

AP PGECT 2025 Counselling: ఏపీ పీజీఈసెట్‌-2025 కు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. జూలై 9వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు.

AP PGECT 2025 Counselling: ఏపీ పీజీ ఈసెట్ కౌన్సిలింగ్ మొదలు.. ఇవాళ్టి నుంచి రిజిస్ట్రేషన్.. నోటిఫికేషన్ విడుదల

AP PGECET 2025 Counselling Notification Released

Updated On : July 9, 2025 / 6:46 AM IST

ఏపీ పీజీఈసెట్‌-2025 కు సంబంధించి కీలక ప్రకటన వచ్చింది. జూలై 9వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుందని అధికారులు వెల్లడించారు. అర్హత సాధించిన అభ్యర్థులు జూలై 9వ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్లు ప్రక్రియ జూలై 12వ తేదీతో పూర్తవుతుంది. జూలై 17వ నుంచి వెబ్ ఆప్షన్లు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈమేరకు అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://cets.apsche.ap.gov.in/ ద్వారా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి.

ఏపీ పీజీఈసెట్‌ 2025 ర్యాంక్ కార్డును ఇలా డౌన్లోడ్ చేసుకోండి:

  • అభ్యర్థులు ముందుగా https://cets.apsche.ap.gov.in/PGECET/ వెబ్ సైట్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.
  • హోం పేజీలో ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
  • తరువాత రిజిస్ట్రేషన్ నెంబర్, పీజీఈసెట్‌ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను ఎంటర్ చేయాలి
  • తరువాత వ్యూ ర్యాంక్ కార్డ్ లింక్ పై క్లిక్ చేయాలి.
  • ఇప్పుడు మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
  • దానిని ప్రింట్ లేదా డౌన్లోడ్ చేసుకోవాలి.
  • కౌన్సిలింగ్ ప్రక్రియలో ఇది చాలా అవసరం

ఇక ఏపీ పీజీఈసెట్‌ – 2025 కోసం మొత్తం 3 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించారు అధికారులు. ఈ పరీక్షలకు 14,231 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో 11,244 మంది ఉత్తీర్ణత సాధించారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకుల ఆధారంగా వారికి సీట్లను కేటాయించనున్నారు.