AP POLYCET 2025: ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. జులై 1 చివరి తేదీ.. మరిన్ని వివరాలు మీకోసం
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తూ అధికారిక ప్రకటన చేసింది.

Ap polycet 2025
పాలీసెట్ 2025 అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేస్తూ అధికారిక ప్రకటన చేసింది. ఇప్పటికే ఫలితాలు విడుడల కాగా… తాజాగా కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల చేశారు అధికారులు. ఇందులో భాగంగా జూన్ 20వ తేదీ నుంచి వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ ముఖ్యమైన వివరాలు:
- ఏపీ పాలిసెట్ మొదటి విడత కౌన్సెలింగ్ జూన్ 20 నుంచి మొదలుకానుంది.
- అందరు విద్యార్థులు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లింపునకు జూన్ 27 చివరి తేదీ.
- ఓసీ, బీసీ రూ.700, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించాల్సి ఉంటుంది.
- అందుకోసం పాలిసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్ నెంబర్, పదో తరగతి మెమో, స్టడీ సర్టిఫికెట్ వివరాలను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది.
- జూలై 3 సాయంత్రం 6 గంటల తర్వాత సీట్ల కేటాయింపు ఉంటుంది.
- అలాట్ మెంట్ తరువాత https://polycet.ap.gov.in/DefaultPage.aspx వెబ్ సైట్ ద్వారా కాపీని పొందవచ్చు.
- హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, పాస్ వర్డ్ ఎంట్రీ చేసి అలాట్ మెంట్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అలాట్ మెంట్ కాపీని సీటు పొందిన కాలేజీలో సమర్పించి.. సీటును కన్ఫర్మ్ చేసుకోవచ్చు.
- ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే convenorpolycetap2025@gmail.com మెయిల్ ఐడీని, హెల్ప్ లైన్ నెంబర్లు 7995681678, 7995865456, 9177927677 సంప్రదించవచ్చు.