Subhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. రోదసీలోకి వెళ్ళిన రెండో ఇండియన్.. ఈ ప్రయోగంలో ఆయనకు ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా?

Subhanshu Shukla: యాక్సియం-4 మిషన్‌ లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు.

Subhanshu Shukla: చరిత్ర సృష్టించిన శుభాన్షు శుక్లా.. రోదసీలోకి వెళ్ళిన రెండో ఇండియన్.. ఈ ప్రయోగంలో ఆయనకు ఎంత జీతం ఇస్తున్నారో తెలుసా?

Subhanshu Shukla life story

Updated On : June 25, 2025 / 4:42 PM IST

యాక్సియం-4 మిషన్‌ లో భాగంగా భారత వ్యోమగామి శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. ఈ ప్రయాణంలో అతనితో పాటు మరో ముగ్గురు విదేశీయులు కూడా అంతరిక్ష కేంద్రానికి ప్రయాణించారు. ఇది మానవ సహిత అంతరిక్ష ప్రయోగాన్నీ అమెరికా ప్రైవేట్ సంస్థ యాక్సియం స్పేస్ విజయవంతంగా చేపట్టింది. భారత కాలమానం ప్రకారం మంగళవారం(జూన్ 24) మధ్యాహ్నం 12:01 గంటలకు స్పేస్ ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

దీంతో రోదసీలోకి వెళ్ళిన రెండో ఇండియన్ గా శుభాన్షు శుక్లా చరిత్ర సృష్టించాడు. అంతకుకముందు 1984లో అంతరిక్ష ప్రయాణం చేసిన తొలి ఇండియన్ రాకేశ్ శర్మ రికార్డ్ క్రియేట్ చేశాడు. దాదాపు 41 ఏళ్ళ తరువాత శుభాన్షు శుక్లా అంతరిక్ష ప్రయాణం చేస్తున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆయన గురించే చర్చ నడుస్తోంది. ఆయన గురించి తెలుసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

శుభాన్షు శుక్లా వ్యక్తిగత, ఉద్యోగ వివరాలు:

శుభాన్షు శుక్లా 10 అక్టోబర్ 1985 ఉత్తర్ ప్రదేశ్ లోని లక్ష్నోలో జన్మించాడు. తండ్రి శంబు దయాల్ శుక్ల. రిటైర్డ్ గవర్న్మెంట్ అధికారి. తల్లి ఆశ శుక్ల. భార్య కామ్నా శుభ శుక్ల. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు.

విద్యాభ్యాసం:
శుభాన్షు శుక్లా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA) B.Sc (2005) పూర్తి చేశారు. ఆ తరువాత ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), బెంగళూరు – M.Tech
వ్యోమగామిగా చేశారు. తరువాత భారత వైమానిక దళం (IAF) లో గ్రూప్ క్యాప్టెన్ హోదాలో పని చేశారు. ఆయనకు 2,000 కంటే ఎక్కువ గంటల ఫ్లయింగ్ చేసిన అనుభవం ఉంది. Su-30, MiG-21, Jaguar, Hawk వంటి వివిధ యుద్ధ విమానాలను ఆయన నడిపారు. 2019లో ISRO యొక్క గగనయాన్ మిషన్ కోసం ఎంపికైన మొదటి 4 వ్యోమగాముల్లో ఒకరు శుభాన్షు శుక్లా. వ్యోమగామిగా ఆయన ప్రస్తుతం జీతం నెలకు రూ.24 లక్షల వరకు ఉంటుందని అంచనా.