BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) లో ఇంజనీర్‌ పోస్టులు భర్తీ

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో 34 డిప్యూటీ ఇంజనీర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల ఖాళీలకు సంబంధించి డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్)18 ఖాళీలు, డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) 16 ఖాళీలు ఉన్నాయి.

BEL Recruitment : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్‌) లో ఇంజనీర్‌ పోస్టులు భర్తీ

BEL Recruitment

Updated On : August 31, 2023 / 11:20 AM IST

BEL Recruitment : భారత ప్రభుత్వం రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నవరత్న కంపెనీ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (BEL) ట్రైనీ ఇంజనీర్ & ప్రాజెక్ట్ ఇంజనీర్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ & టెక్నీషియన్, ప్రొబేషనరీ ఇంజనీర్ మొదలైన వివిధ పోస్టుల భర్తీ చేపట్టనుంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు ఆహ్వనిస్తోంది.

READ ALSO : Shrimp Farming : రొయ్యపిల్లల పెంపకానికి.. బయోసెక్యూరిటీ నర్సరీలు

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ తన అధికారిక వెబ్‌సైట్‌లో 34 డిప్యూటీ ఇంజనీర్ ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల ఖాళీలకు సంబంధించి డిప్యూటీ ఇంజనీర్ (మెకానికల్)18 ఖాళీలు, డిప్యూటీ ఇంజనీర్ (ఎలక్ట్రానిక్స్) 16 ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : YS Sharmila: సోనియా, రాహుల్‌తో వైఎస్ షర్మిల దంపతులు భేటీ.. కాంగ్రెస్‌లో వైఎస్ఆర్‌టీపీ విలీనంపై చర్చ? కేసీఆర్‌కు కౌంట్‌డౌన్ మొదలైందన్న షర్మిల

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి బీఈ, బీటెక్, బీఎస్సి, పూర్తిచేసి ఉండాలి. ఏడాది పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 28 సంవత్సరాల లోపు ఉండాలి.

READ ALSO : Malaria vaccine : త్వరలో మలేరియా వ్యాక్సిన్…సీరం ఇన్‌స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా వెల్లడి

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి రాతపరీక్ష, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు సెప్టెంబర్ 09, 2023 చివరి తేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://bel-india.in/ పరిశీలించగలరు.