Job Vacancies : భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ,బీటెక్,ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి.

Bharat Electronics Limited is filling up various job vacancies
Job Vacancies : భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన గజియాబాద్‌లోనున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 24 డిప్యూటీ ఇంజినీర్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, కమ్యూనికేషన్, టెలికమ్యూనికేషన్ విభాగాల్లో ఈ ఖాళీలున్నాయి.
అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుంచి సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈ,బీటెక్,ఇంజినీరింగ్ లేదా తత్సమాన కోర్సులో ఉత్తీర్ణత సాధించినవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సంబంధిత విభాగంలో పని అనుభవం కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయసు 25 యేళ్లకు మించకుండా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు. ప్రతిభ కనబరచిన వారికి మొదటి ఏడాది నెలకు రూ.40,000ల నుంచి రూ.1,40,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో అక్టోబర్ 6, 2022వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.bel-india.in/ పరిశీలించగలరు.