BSF Tradesman Recruitment 2025: BSFలో ఉద్యోగాలు.. 3588 పోస్టులు.. వయసు, విద్యార్హతలు, ఫీజు, ఎంపిక ప్రక్రియ పూర్తి వివరాలు..
ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 25 ఆగస్టు 2025 వరకు నమోదు చేసుకోవచ్చు.

BSF Tradesman Recruitment 2025: కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కేంద్ర సాయుధ పోలీసు దళం బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF).. కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మన్) పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 3588 ఖాళీలు ఉన్నాయి. ఇందులో పురుషులకు 3406, మహిళలకు 182 ఉద్యోగాలు ఉన్నాయి. BSF ట్రేడ్స్‌మన్ రిక్రూట్‌మెంట్ 2025 కోసం ఫారమ్-ఫిల్లింగ్ ప్రక్రియ https://.bsf.gov.in/, https://rectt.bsf.gov.in/లో ప్రారంభమైంది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు 25 ఆగస్టు 2025 వరకు నమోదు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలతో BSF ట్రేడ్స్‌మెన్ నోటిఫికేషన్ 2025 PDF విడుదల చేయబడింది. 3588 కానిస్టేబుల్ (ట్రేడ్స్‌మెన్) ఖాళీల నియామకానికి భారతీయ పురుష, మహిళా అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పే స్కేల్ రూ. 21.709- 69 వేల 100గా ఉంది. ట్రేడ్స్‌మెన్ పోస్టుల అభ్యర్థుల ఎంపికలో శారీరక పరీక్ష, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), ట్రేడ్ టెస్ట్, వైద్య పరీక్ష ఉన్నాయి.
ముఖ్యమైన తేదీలు
నోటిఫికేషన్ విడుదల తేదీ – 25 జూలై 2025
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం – 26 జూలై నుండి 25 ఆగస్టు 2025
సవరణ తేదీలు – 24 నుండి 26 ఆగస్టు 2025 (రాత్రి 11 గంటలు)
పరీక్ష తేదీ – తెలియజేయబడుతుంది
అర్హత
విద్యా అర్హత – 10వ తరగతి ఉత్తీర్ణత + సంబంధిత రంగంలో ITI
వయసు పరిమితి (25/8/2025 నాటికి) – 18 నుండి 25 సంవత్సరాలు
అప్లికేషన్ ఫీజు..
జనరల్/ఓబీసీ/ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ. 150 + 18% జీఎస్టీ
ఎస్సీ/ఎస్టీ/మహిళా అభ్యర్థులు, బీఎస్ఎఫ్ సిబ్బంది, మాజీ సైనికులకు మినహాయింపు.
Also Read: ఏపీ జిల్లా కోర్టుల్లో ఉద్యోగాలు.. 1,620 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పూర్తి వివరాలు..
ఎంపిక ప్రక్రియ..
శారీరక ప్రమాణాల పరీక్ష (PST), శారీరక సామర్థ్య పరీక్ష (PET)
రాతపరీక్ష
డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్ (వర్తిస్తే)
వైద్య పరీక్ష.
కుక్, వాటర్ క్యారియర్, వెయిటర్ పోస్టులకు విద్యార్హతలు..
* గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం
* ఎన్ ఎస్ సీ నుంచి ఫుడ్ ప్రొడక్షన్ లేదా కిచెన్ కోర్స్ చేసి ఉండాలి. లేదా గుర్తింపు పొందిన సంస్థలో కోర్స్ చేసి ఉండాలి.
కార్పెంటర్, ప్లంబర్, పెయింటర్, ఎలక్ట్రీషియన్, పంప్ ఆపరేటర్ పోస్టులకు విద్యార్హతలు..
* గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం
* ఐటీఐలో రెండేళ్ల ట్రేడ్.. లేదా ఒక ఏడాది ఐటీఐ/ వొకేషనల్ కోర్సు.
* ఒక సంవత్సరం అనుభవం కలిగుండాలి.
కాబ్లర్, టైలర్, వాషర్ మెన్, బార్బర్, స్వీపర్ పోస్టులకు విద్యార్హతలు..
* గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణత లేదా తత్సమానం
* సంబంధిత ట్రేడ్‌లో ప్రావీణ్యం కలిగి ఉండాలి
* ట్రేడ్ పరీక్షకు అర్హత సాధించాలి
వయసు..(25/8/2025)
* BSF రిక్రూట్‌మెంట్ 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
* షెడ్యూల్ కులం/షెడ్యూల్ తెగకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితికి మించి 5 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వబడుతుంది.
* ఇతర వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితికి మించి 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఇవ్వబడుతుంది.
ఎంపిక ప్రక్రియ..
ట్రేడ్స్‌మెన్ ఎంపిక ప్రక్రియ బహుళ దశలను కలిగి ఉంటుంది..
స్టేజ్ 1: శారీరక పరీక్ష: శారీరక ప్రమాణాల పరీక్ష (PST), శారీరక సామర్థ్య పరీక్ష (PET), ట్రేడ్ టెస్ట్ (వర్తిస్తే)
స్టేజ్ 2: వివిధ విషయాలను కవర్ చేసే ఆబ్జెక్టివ్-టైప్ రాత పరీక్ష. డాక్యుమెంట్ వెరిఫికేషన్, వైద్య పరీక్ష కోసం పిలవబడటానికి అభ్యర్థులు ఈ పరీక్షలో అర్హత సాధించాలి.
స్టేజ్ 3: డాక్యుమెంట్ వెరిఫికేషన్, ట్రేడ్ టెస్ట్
స్టేజ్ 4: వైద్య పరీక్ష: ఈ దశలో ఉత్తీర్ణత సాధించిన తర్వాత, వారికి పూర్తి శరీర తనిఖీ జరిగే ఆసుపత్రిని కేటాయిస్తారు.