CISF Recruitment 2025: బిగ్ అలెర్ట్.. సీఐఎస్ఎఫ్ భారీ రిక్రూట్మెంట్.. 70 వేల పోస్టుల భర్తీకి ప్లాన్
CISF Recruitment 2025: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) త్వరలోనే భారీ నియామక ప్రకటన చేయనుంది.

CISF planning to fill 70,000 posts, notification soon
CISF Recruitment 2025: చదువైపోయి ప్రభుత్వ ఉద్యోగం కోసం కష్టపడుతున్నారా. అయితే, ఈ బంపర్ ఆఫర్ మీకోసమే. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్ఎఫ్) త్వరలోనే భారీ నియామక ప్రకటన చేయనుంది. ఇప్పటికే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ లో 1.62 లక్షల సిబ్బంది ఉండగా దానిని 2.20 లక్షలకు పెంచేందుకు కేంద్ర హోంశాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే కొత్తగా 70,000 పోస్టులను భర్తీ చేయడానికి ప్రణాలికలు సిద్ధం చేస్తున్నారు. వచ్చే ఐదేళ్లలోనే ఈ పోస్టులను కేంద్రం భర్తీ చేయనుంది.
ఈ ప్రక్రియలో భాగంగా ఏటా సగటున 14,000 మంది సిబ్బందిని నియమించాలని సీఐఎస్ఎఫ్ భావిస్తోంది. ఇక ఛత్తీస్ గఢ్ వంటి రాష్ట్రాల్లో నక్సలిజం తగ్గుముఖం పట్టడంతో కొత్త పారిశ్రామిక కేంద్రాలు వాస్తాయని భావిస్తున్నారు. 2024లో సీఐఎస్ఎఫ్ 13,230 మందిని రిక్రూట్ చేయగా 2025 సంవత్సరానికి అది 24,098 కి పెరిగింది. వీటిలో మహిళల భాగస్వామ్యయం కూడా పెరుగుతుంది. ఈ కొత్తగా నియామకాలు జరిగిన వారిని జమ్ముకశ్మీర్ లోని విమానయానం, సముద్ర ఓడరేవులు, అణు స్థావరాలు, థర్మల్ పవర్ ప్లాంట్లు, జలవిద్యుత్ కేంద్రాలు, జైళ్లు వంటి కీలక రంగాల్లో మోహరించనున్నారు.
Also, Read: బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్.. 330 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. డైరెక్ట్ లింక్ తో ఇలా అప్లై చేసుకోండి