కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ ఇదే
హైదరాబాద్ : కామన్ ఎంట్రన్స్ పరీక్షల పర్వం మొదలు కానుంది. తెలంగాణలో కామన్ ఎంట్రన్స్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఉన్నత విద్యామండలి పరీక్షల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈమేరకు పరీక్షల తేదీలను ప్రకటించింది. తెలంగాణ ఎంసెట్ నిర్వహణ బాధ్యతను మళ్లీ జేఎన్ టీయూ హైదరాబాద్ కు అప్పగించారు. ఈసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను మహాత్మగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ)కు అప్పజెప్పారు. ఐసెట్ పరీక్ష నిర్వహణ బాధ్యతను కాకతీయ యూనివర్సిటీ చూసుకుంటుంది. లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షల నిర్వహణను ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)కి అప్పగించారు. పీజీఈసెట్ పరీక్షను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహిస్తుంది. ఎడ్ సెట్ నిర్వహణ బాధ్యతను కూడా ఉస్మానియా యూనివర్సిటీకే అప్పగించారు.
2019, మే 3, 4, 6 తేదీలలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్, మే 8, 9న అగ్రికల్చర్ ఎంట్రన్స్, మే 11న టీఎస్ ఈసెట్ పరీక్షలను జేఎన్ టీయూ హైదరాబాద్ నిర్వహించనుంది. మే 20న పీఈసెట్ ను మహాత్మగాంధీ యూనివర్సిటీ (ఎంజీయూ) నిర్వహించనుంది. మే 23, 24న ఐసెట్ పరీక్షను కేయూ నిర్వహిస్తుంది. మే 26న లాసెట్, పీజీఎల్ సెట్ పరీక్షలను ఓయూ నిర్వహించనుంది. మే 27 నుంచి 29 వరకు జరుగనున్న పీజీఈసెట్ పరీక్షను ఓయూ నిర్వహిస్తుంది. మే 30, 31న ఎడ్ సెట్ పరీక్ష నిర్వహణ బాధ్యత ఉస్మానియా యూనివర్సిటీదే.
- మే 3, 4, 6 తేదీలలో ఇంజినీరింగ్ ఎంట్రన్స్
- మే 8, 9 తేదీలలో అగ్రికల్చర్ ఎంట్రన్స్
- మే 11న టీఎస్ ఈసెట్
- మే 20న పీఈసెట్
- మే 23, 24 తేదీలలో ఐసెట్
- మే 26న లాసెట్, పీజీఎల్ సెట్
- మే 27 నుంచి 29 వరకు పీజీఈసెట్
- మే 30, 31 తేదీలలో ఎడ్ సెట్