CRPF లో 1412 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్

  • Published By: veegamteam ,Published On : February 21, 2020 / 08:35 AM IST
CRPF లో 1412 హెడ్ కానిస్టేబుల్ జాబ్స్

Updated On : February 21, 2020 / 8:35 AM IST

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో మొత్తం 1412 హెడ్ కానిస్టేబుల్ పోస్టులు ఉన్నాయి. ఇప్పటికే జనరల్ డ్యూటీ, బగ్లర్, మాలి, పెయింటర్ లాంటి విభాగాల్లో కానిస్టేబుల్‌ గా పనిచేస్తున్న పురుషులు, మహిళల నుంచి దరఖాస్తుల్ని కోరుతోంది. వీరు గ్రూప్‌ సీ హెడ్ కానిస్టేబుల్  పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. 

 

లిమిటెడ్ డిపార్ట్‌మెంటల్ కాంపిటీటీవ్ ఎగ్జామినేషన్ (LDCE 2019) ద్వారా ఈ ఖాళీలను భర్తీ చేయనుంది. ప్రస్తుతానికి ఇవి తాత్కాలిక పోస్టులు మాత్రమే. కానీ, ప్రభుత్వ నియమనిబంధనల ప్రకారం పర్మనెంట్ కావొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2020 మార్చి 5 చివరి తేదీ.  

అభ్యర్ధులకు సర్వీస్‌ లో నాలుగేళ్లు పూర్తి చేయడంతో పాటు బేసిక్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉండాలి. 4,5 ఏళ్ల సర్వీస్ ఉంటే 04 మార్కులు. 5,6 ఏళ్ల సర్వీస్ ఉంటే 8 మార్కులు. 6,7 ఏళ్ల సర్వీస్ ఉంటే 12 మార్కులు. 7,8 ఏళ్ల సర్వీస్ ఉంటే 20 మార్కుల వెయిటేజీ లభిస్తుంది.

పరీక్ష విధానం: 
రాతపరీక్ష ద్వారా విద్యార్ధులను ఎంపిక చేస్తారు. 

ఎంపిక విధానం: 
అభ్యర్ధులను రాత పరీక్ష, శరీర కొలతలు, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్, యోగ్యతా పత్రం, మెడికల్ ఎగ్జామినేషన్, మెరిట్ లిస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

Read Also.. నో బ్యాగ్ డే : విద్యార్ధులకు హ్యాపీ Saturday