CTET 2024 Registrations : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష పూర్తి వివరాలివే!

CTET 2024 Registrations : సీటెట్-జూలై 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 7, 2024న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2, 2024 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగనుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

CTET 2024 Registrations : సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. దరఖాస్తు ప్రక్రియ, పరీక్ష పూర్తి వివరాలివే!

CTET 2024 : Registrations Started For Central Teacher Eligibility Test

CTET 2024 Registrations : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ 19వ ఎడిషన్ సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET)ని జూలై 7, 2024న నిర్వహించనుంది. సీటెట్-జూలై 2024 కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు మార్చి 7, 2024న ప్రారంభమయ్యాయి. ఏప్రిల్ 2, 2024 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.

Read Also : 2024 SSC Hall Tickets : తెలంగాణ టెన్త్ క్లాస్ హాల్‌టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్‌ చేసుకోండి.. పరీక్షలు ఎప్పటినుంచంటే?

ఈ పరీక్ష ఫీజును చెల్లించడానికి చివరి తేదీ కూడా ఏప్రిల్ 2, 2024 వరకు సమయం ఉంటుంది. సీటెట్ పరీక్ష జూలై 7, 2024న జరుగనుంది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే అభ్యర్థులు సీటెట్ వెబ్‌సైట్ (https://ctet.nic.in/) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు ఒక పేపర్‌కు రూ.1,000 పరీక్ష ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. రెండు పేపర్లను రాసే అభ్యర్థులు రూ. 1,200 చెల్లించాలి.

ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే? :

  • సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి.
  • ‘ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి’ లింక్‌ క్లిక్ చేసి ఓపెన్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌ను నింపండి.
  • రిజిస్ట్రేషన్ నంబర్/అప్లికేషన్ నంబర్‌ను నోట్ చేయండి.
  • లేటెస్ట్ స్కాన్ చేసిన ఫొటో, డిజిటల్ సైన్ అప్‌లోడ్ చేయండి.
  • పరీక్ష రుసుమును డెబిట్/క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించండి.
  • రికార్డ్, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం కన్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకోండి.

దేశవ్యాప్తంగా 136 నగరాల్లో 20 భాషల్లో పరీక్ష నిర్వహించనున్నారు. పరీక్ష, సిలబస్, భాషలు, అర్హత ప్రమాణాలు, పరీక్ష రుసుము, పరీక్ష కేంద్రాలు వంటివి ముఖ్యమైన తేదీల వివరాలతో కూడిన సమాచారం సీటెట్ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. సీటెట్‌లో హాజరు కావడానికి కనీస అర్హతలు నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (NCTE) ద్వారా తెలియజేస్తుంది. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి ముందు తమ అర్హత ప్రమాణాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also : AP TET 2024 : ఏపీ టెట్ పరీక్ష 2024 రెస్పాన్స్ షీట్ విడుదల.. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి..!