IIP Recruitment : డెహ్రాడూన్‌ ఐఐపీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ రూ.35,400-రూ.1,12,400. టెక్నీషియన్ రూ.19,900 - రూ.63,200. చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. చెల్లించాల్సి ఉంటుంది.

IIP Recruitment : డెహ్రాడూన్‌ ఐఐపీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

IIP Dehradun Recruitment

Updated On : October 25, 2023 / 11:04 AM IST

IIP Recruitment : సీఎస్ఐఆర్-ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం(ఐఐపీ) డెహ్రాడూన్‌‌లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 51 టెక్నికల్ అసిస్టెంట్&టెక్నీషియన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టుల్లో టెక్నికల్ అసిస్టెంట్: 24, టెక్నీషియన్-1: 27 ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Kodali Nani : లోకేశ్ సమర్ధుడైతే ఇంట్లో మహిళలు రోడ్లమీదకు ఎందుకొస్తారు..? : కొడాలి నాని

మెకానికల్/ ఎలక్ట్రానిక్స్/ ఈఈఈ/ సివిల్/ కెమికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, జర్నలిజం తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయోపరిమితి 28 సంవత్సరాలు మించరాదు.

READ ALSO : Gutta Sukhender Reddy : తెలంగాణాకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష : గుత్తా సుఖేందర్ రెడ్డి

రాత పరీక్ష, ట్రేడ్/ స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి వేతనంగా టెక్నికల్ అసిస్టెంట్ రూ.35,400-రూ.1,12,400. టెక్నీషియన్ రూ.19,900 – రూ.63,200. చెల్లిస్తారు. దరఖాస్తు ఫీజుగా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఉమెన్, ఎక్స్- సర్వీస్‌మెన్, అబ్రాడ్, సీఎస్ఐఆర్ రెగ్యులర్ ఉద్యోగులకు ఫీజునుంచి మినహాయింపు వర్తిస్తుంది.

READ ALSO : Prevent Respiratory Problems : శ్వాసకోశ సమస్యలు నిద్రకు భంగం కలిగిస్తుంటే నివారణకు సహజ చిట్కాలు !

అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ 09.11.2023 గా నిర్ణయించారు. దరఖాస్తు హార్డ్ కాపీలను 19.11.2023.లోగా పంపాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://devapps.ngri.res.in/ పరిశీలించగలరు.