సర్కారు స్కూళ్లల్లో ఆంగ్లం

  • Published By: madhu ,Published On : December 30, 2019 / 03:32 AM IST
సర్కారు స్కూళ్లల్లో ఆంగ్లం

Updated On : December 30, 2019 / 3:32 AM IST

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన వైపుకు అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన ఏపీలో దీనిపై ఓ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే..పలువురి నుండి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి. తాజాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మీడియం మార్పునకు ఒకే చెప్పాలని డిసైడ్ అయ్యింది. అయితే..స్కూల్ మేనేజ్ మెంట్ కమిటీ (NMC) తీర్మానం చేయాల్సి ఉంటుంది.

 

ఇది ఒకే చెబితే..తెలుగు మీడియం నుంచి ఇంగ్లీషు మీడియంలోకి మార్చుతామని, దీనికి సంబంధించిన ప్రతిపాదనలను పాఠశాల విద్యాశాఖ సిద్ధం చేసింది. ప్రభుత్వ ఆమోదం తర్వాత..అమల్లోకి రానున్నాయి. దీంతో తెలుగు మీడియం స్కూళ్లు ఇంగ్లీషు మీడియంలోకి మారడం మరింత సులభతరం కానుందని అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 40 వేల 597 పాఠశాలలుంటే..ఇందులో గవర్నమెంట్ స్కూల్స్ 26 వేల 754, ప్రైవేటు స్కూళ్లు 10 వేల 549 ఉన్నాయి. మిగతావి ఎయిడెడ్, గురుకుల, కేంద్రీయ విద్యాలయాలున్నాయి.

 

ప్రభుత్వ పాఠశాలల్లో 5 వేల వరకు ఉన్నత పాఠశాలలున్నాయి. సగం స్కూళ్లలో ఇంగ్లీషు మీడియం ఉంది. 37.82 శాతం మంది స్టూడెంట్స్ ఇంగ్లీషు మీడియంలో చదువుతుండగా..57.46 శాతం మంది విద్యార్థులు తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. మరో 4.72 శాతం మంది విద్యార్థులు ఇతర మీడియంలో విద్యనభ్యసిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో 96.94 శాతం స్టూడెంట్స్ ఇంగ్లీషు మీడియంలోనే చదువుకుంటుండగా…2.06 శాతం మంది తెలుగు మీడియంలో చదువుకుంటున్నారు. ఒక్క శాతం ఇతర మీడియం విద్యార్థులున్నారు. 

ఇంగ్లీషు మీడియంలో బోధిస్తామని టీచర్లు ముందుకొచ్చినా..తల్లిదండ్రులు ఇంగ్లీషు మీడియాన్ని కోరుకున్నా..ఆ పాఠశాల మేనేజ్ మెంట్ కమిటీ ఒక్క తీర్మానం చేస్తే సరిపోతుంది. ఆ పాఠశాలను ఇంగ్లీషు మీడియంలోకి మార్చేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అన్నింటినీ ఒకేసారి కాకుండా..ఒక్కో తరగతి వారీగా మార్పునకు చర్యలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 

Read More : మున్సిపల్ చట్టం ఏం చెబుతోంది ?.. నేతలు తెలుసుకోవాల్సిన విషయాలు