TTD Recruitment : టీటీడీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ చెందినవారై , హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లు మించరాదు.

TTD Recruitment : టీటీడీలో ఉద్యోగ ఖాళీల భర్తీ

Recruitment Vacancy

Updated On : October 27, 2023 / 9:34 AM IST

TTD Recruitment : తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 56 ఏఈఈ, ఏఈ, ఏటీవో వంటి ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (సివిల్): 27 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్): 10 పోస్టులు, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్): 19 పోస్టుల ఖాళీలు ఉన్నాయి.

READ ALSO : RAILTEL Recruitment : రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో ఉద్యోగ ఖాళీల భర్తీ

దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్‌ చెందినవారై , హిందూ మతానికి చెందిన వారై ఉండాలి. విద్యార్హతల విషయానికొస్తే బీఈ, బీటెక్‌ (సివిల్‌/మెకానికల్‌), ఎల్‌సీఈ/ఎల్‌ఎంఈ డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయసు 42 ఏళ్లు మించరాదు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

READ ALSO : B. Mohan Reddy – Bithiri Sathi : బీఆర్ఎస్ లోకి బీజేపీ నేత బి.మోహన్ రెడ్డి, ప్రముఖ కళాకారుడు బిత్తిరి సత్తి

ఏఈఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ. 57,100 నుంచి రూ. 1,47,760 వరకు చెల్లిస్తారు. ఏఈ పోస్టులకు నెలకు రూ. 48,440 నుంచి రూ. 1,37,220 వరకు జీతంగా చెల్లిస్తారు. ఏటీవో పోస్టులకు నెలకు రూ. 37,640 నుంచి రూ. 1,15,500 వరకు జీతంగా చెల్లిస్తారు. దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 23 చివరితేదిగా నిర్ణయించారు. పూర్తి వివరాల కోసం https://www.tirumala.org/ పరిశీలించగలరు.