IOCL Recruitment : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో అప్రెంటీస్ ఖాళీల భర్తీ
పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ట్రేడ్ అప్రెంటీస్ 150, టెక్నీషియన్ అప్రెంటీస్ 110, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 230 ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు ఉన్నాయి.

IOCL Recruitment :
IOCL Recruitment : ప్రభుత్వ రంగ సంస్థల్లో ఒకటైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 490 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో అప్రెంటీస్, అకౌంట్స్, ఎగ్జిక్యూటివ్ తదితర పోస్టులు ఉన్నాయి. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Malaria vaccine : త్వరలో మలేరియా వ్యాక్సిన్…సీరం ఇన్‌స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా వెల్లడి
పోస్టుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే ట్రేడ్ అప్రెంటీస్ 150, టెక్నీషియన్ అప్రెంటీస్ 110, గ్రాడ్యుయేట్ అప్రెంటీస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ 230 ఖాళీలు ఉన్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రీజియన్లలో ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Turmeric Cultivation : సేంద్రీయ పసుపు సాగులో ఎరువులు, నీటి యాజమాన్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులకు 10వ తరగతి, టెక్నీషియన్ అప్రెంటీస్ కు డిప్లొమా, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్/ అకౌంట్స్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు డిగ్రీ, BBA, BA, B.Com, B.Sc. విద్యార్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు ఆగస్టు 31, 2023 నాటికి కనిష్టంగా 18 సంవత్సరాలు మరియు గరిష్టంగా 24 సంవత్సరాలు మించకూడదు.
READ ALSO : Hair Health : వర్షకాలంలో జుట్టు ఆరోగ్యం కోసం పెరుగుతో ఇలా చేసి చూడండి !
ఈ ఉద్యోగాలకు దరఖాస్తులను ఆన్లైన్ విధానంలో సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 10ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iocl.com/apprenticeships పరిశీలించగలరు.