University of Hyderabad : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెల్డీ, నెట్,స్లెట్,సెట్ తో పాటుగా పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Non Teaching Jobs
University of Hyderabad : యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లో పలు నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 95 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత, ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
READ ALSO : Recruitment of Staff Nurse Posts : ఏపి వైద్య,ఆరోగ్య శాఖలో స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీ
ఖాళీల వివరాలకు సంబంధించి డిప్యూటీ రిజిస్ట్రార్ (డిప్యుటేషన్)-1, అసిస్టెంట్ లైబ్రేరియన్- 4, అసిస్టెంట్ రిజిస్ట్రార్- 2, సెక్షన్ ఆఫీసర్- 2, అసిస్టెంట్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్)- 02, సెక్యూరిటీ ఆఫీసర్- 2, సీనియర్ అసిస్టెంట్- 2, ప్రొఫెషనల్ అసిస్టెంట్-1, జూనియర్ ఇంజినీర్ (సివిల్, ఎలక్ట్రికల్)- 8, అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 1, జూనియర్ ప్రొఫెషనల్ అసిస్టెంట్- 2, స్టాటిస్టికల్ అసిస్టెంట్- 1, ఆఫీస్ అసిస్టెంట్- 10, లైబ్రరీ అసిస్టెంట్- 4, జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్- 44, హిందీ టైపిస్ట్ 1, ల్యాబొరేటరీ అటెండెంట్-8 ఉన్నాయి.
READ ALSO : Cluster Beans Cultivation : గోరుచిక్కుడు సాగు.. తక్కువ పెట్టుబడితో అధిక లాభాలను ఆర్జిస్తున్న రైతులు
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి సంబంధిత విభాగంలో ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఎంఫిల్, పీహెల్డీ, నెట్,స్లెట్,సెట్ తో పాటుగా పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆన్ లైన్ విధానంలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే దరఖాస్తులను ప్రింట్ తీసుకొని.. ఆఫ్ లైన్ లో అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్మెంట్ సెల్, రూమ్ నెం 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ , ప్రొఫెసర్. సి.ఆర్. రావు రోడ్, సెంట్రల్ యూనివర్సిటీ, గచ్చిబౌలి, హైదరాబాద్ చిరునామాకు చేరే విధంగా పంపాలి.
READ ALSO : Cotton and Soya Crops : పత్తి,సోయాలో ఎరువుల యాజమాన్యంలో చేపట్టాల్సిన చర్యలు
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 30, 2023గా నిర్ణంచారు. దరఖాస్తు హార్డ్ కాపీలను అక్టోబర్ 06, 2023నాటికి చేరేలా చూసుకోవాలి. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ఫ https://uohyd.ac.in/ పరిశీలించగలరు.