ఇంజనీరింగ్ విద్యార్థులకు…ఆన్ లైన్ పాఠాలు

  • Published By: madhu ,Published On : August 13, 2020 / 10:22 AM IST
ఇంజనీరింగ్ విద్యార్థులకు…ఆన్ లైన్ పాఠాలు

కరోనా టైంలో విద్యా వ్యవస్థ మారిపోతోంది. ఇంజినీరింగ్ బీ ఫార్మసీ, ఇతర కోర్సుల పాత విద్యార్థులకు ఆన్ లైన్ తరగతులు నిర్వహించేందుకు జెన్టీయూహెచ్ నిర్ణయించింది. ఈ నెల 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 17 నుంచి ఆన్ లైన్ తరగతులు ప్రారంభించుకోవచ్చని విశ్వవిద్యాలయాలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి అనుమతినిచ్చింది.

వర్సిటీ రిజిస్టార్ మాట్లాడుతూ..తరగతుల్లో పాఠాలు చెప్పాలంటే..హాస్టళ్లు తెరవాల్సిన పరిస్థితి ఉంటుందని, ఉన్నత విద్యామండలి నుంచి ఆదేశాలు రాలేదని తెలిపారు. ప్రతి రోజు నాలుగు తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఉంటుంది. మూడు, నాలుగా తరగతులు నిర్ణయించుకోవాల్సింది కళాశాలల ప్రిన్స్ పాళ్లు నిర్ణయించుకుంటారు.

మధ్యాహ్నం భోజనానికి మూడు, తర్వాత ఒక పీరియడ్ జరుపుకోవచ్చు. ఒక్కీ పీరియడ్ గంట వరకు టైం ఉంటుంది.
జెఎన్టీయూహెచ్ పరిధిలో బీటెక్, బీఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ తదితర కోర్సుల చివరి సెమిస్టర్ పరీక్షలు సెప్టెంబర్ 16 నుంచి మొదలుపెట్టేందుకు అధికారులు టైం టేబుల్ సిద్ధం చేశారు.

విద్యార్థులు ఇప్పుడున్న ఊళ్లకు దగ్గరలోని పరీక్షలు రాసుకొనేలా వెసులుబాటు కల్పించనున్నారు. ఒక కళాశాల విద్యార్థులు వేర్వేరు చోట్ల పరీక్షలు రాయనున్నందున ఏ కాలేజీలో ఎందరు హాజరవుతారో వివరాలు తెప్పంచుకుని ఆ మేరకు వాటికి ప్రశ్నాపత్రాలను సరఫరా చేయనున్నారు.