Join ISRO : ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్ కావటం ఎలా ?

ఇంటర్ తరువాత ఇస్రోలో చేరాలనుకునే వారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST)లో చేరవచ్చు. దీనిలో చేరటం కోసం ముందుగా జెఇఇ లేదా ఐఐఎస్ఈఆర్ నిర్వహించే సెంట్రల్ బోర్డ్ బేస్ట్ అప్టిట్యూడ్ టెస్ట్ వ్రాయాల్సి ఉంటుంది.

Join ISRO : ఇస్రోలో స్పేస్ సైంటిస్ట్ కావటం ఎలా ?

ISRO

Join ISRO – Space Scientist : ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్, ఇస్రో. ప్రపంచంలోని అతిపెద్ద అంతరిక్ష సంస్థలలో ఒకటి. దీని ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఆగష్టు 15, 1969న స్థాపించబడింది. దేశాభివృద్ధి లక్ష్యంగా సృజనాత్మక సాంకేతికతతో అంతరిక్ష విజ్ఞానాన్ని అభివృద్ధి చేసే సంస్ధల్లో ఇది ప్రసిద్ధి గాంచింది. తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి తీసుకెళ్లడం ద్వారా అనేక మిషన్లను విజయవంతంగా పూర్తి చేసింది.

READ ALSO : Crow : కాలజ్ఞాని కాకి అరుపులో గొప్ప సందేశం, కాకి జీవితం మానవులకు కూడా ఆదర్శం

చాలా మంది చిన్నారుల్లో ISROలో శాస్త్రవేత్తగా చేరాలన్న అకాంక్ష ఉంటుంది. అయితే దానికి సంబంధించిన వివరాలు చాలా మంది విద్యార్ధులకు ఏమాత్రం అవగాహన ఉండదు. అత్యునతమైన ఈ అంతరిక్ష సంస్ధలో చేరటానికి అనుసరించాల్సిన విద్యావిధానానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఇస్రోలో సైంటిస్ట్ అవ్వడం ఎలా?

ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇస్రోలో శాస్త్రవేత్తగా చేరడానికి మూడు మార్గాలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం, IITలు, NITల్లో క్యాంపస్ రిక్రూట్‌మెంట్ ద్వారా ఇంజనీర్లను నియమించుకుంటారు. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST)లో చేరడం ద్వారా శాస్త్రవేత్తగా, ఇంజనీర్‌గా ఎంపిక అయ్యేందుకు మంచి మార్గం. దీంతోపాటుగా ISROలో శాస్త్రవేత్త కావడానికి సంబంధిత బ్రాంచ్‌లో ఇంజనీరింగ్ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ICRB పరీక్ష రాయాల్సి ఉంటుంది.

READ ALSO : Wedding Day: పెళ్లి రోజునే దంపతులను విడగొట్టిన కేకు.. విడాకుల కోసం కోర్టుకు భార్య

ఇంటర్మీడియట్ తరువాత ఇస్రోలో చేరటం ఎలా ?

ఇస్రోలో ఉద్యోగం సాధించాలన్న అకాంక్ష ఉన్న వారు ముందుగా హైస్కూల్‌ స్ధాయిలో గణిత , భౌతిక, రసాయన శాస్త్ర సబ్జెక్టును తప్పనిసరిగా చదివి ఉండాలి. ప్రాథమిక అంశాలను క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలి. వాటిలో 75% లేదా అంతకంటే ఎక్కువ ఉత్తీర్ణత ఫలితాలను సాధించి ఉండాలి. అనంతరం ఇంటర్మీడియట్ పూర్తి చేయాలి. ఆనంతరం ఉన్నత చదువులలో భాగంగా ఇంజనీరింగ్‌ విద్యను అభ్యసించాలి. B.Tech/BE లలో మెకానికల్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ , ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ , ఏరోస్పేస్ ఇంజనీరింగ్ , కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ , ఇంజనీరింగ్ ఫిజిక్స్ , రేడియో ఇంజనీరింగ్ వంటి స్పెషలైజేషన్లలో దేనినైనా అభ్యసించవచ్చు .

READ ALSO : Crocodile Attacked : ఓ మై గాడ్.. స్నానం చేస్తుండగా మహిళపై మొసలి దాడి, రెప్పపాటులో దారుణం.. ఒళ్లుగగుర్పొడిచే వీడియో

అదే క్రమంలో ఇంటర్ తరువాత ఇస్రోలో చేరాలనుకునే వారు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (IIST)లో చేరవచ్చు. దీనిలో చేరటం కోసం ముందుగా జెఇఇ లేదా ఐఐఎస్ఈఆర్ నిర్వహించే సెంట్రల్ బోర్డ్ బేస్ట్ అప్టిట్యూడ్ టెస్ట్ వ్రాయాల్సి ఉంటుంది.

అలాగే ఇస్రో ప్రతి సంవత్సరం ICRB (ISRO సెంట్రలైజ్డ్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఎగ్జామ్) పరీక్షను నిర్వహిస్తుంది. BE, BTech, BSc(Engg), లేదంటే డిప్లొమా + BE/BTech (లేటరల్ ఎంట్రీ) పూర్తి చేసిన వారు ఈ పరీక్ష రాయవచ్చు. అయితే, కంప్యూటర్, మెకానికల్ మరియు ఎలక్ట్రానిక్ స్ట్రీమ్‌లకు చెందిన విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు.

READ ALSO : Marigold Flower Farming : మార్కెట్ లో బంతికి మంచి డిమాండ్.. అధిక దిగుబడి కోసం మేలైన యాజమాన్యం

ప్రతి సంవత్సరం, ఇస్రో తన అవసరాల ఆధారంగా IIST విద్యార్థులను నేరుగా శాస్త్రవేత్తలుగా ఆహ్వానిస్తుంది. అయితే, ISRO ఉద్యోగులుగా తీసుకోబడాలంటే వీరు తప్పనిసరిగా 7.5 CGPAని సాధించి ఉండాలి.

డైరెక్ట్ రిక్రూట్ మెంట్ విషయానికి వస్తే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆప్ టెక్నాలజీ, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారిని ఇస్రో నేరుగా శాస్త్రవేత్తలుగా నియమించుకుంటుంది. ఇంజనీరింగ్ లో ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎరోస్పేస్ , మెకానికల్ స్పెషలైజేషన్ కలిగిన వారిని నియామకాలలో పరిగణలోకి తీసుకుంటారు.