Jobs: భారీ జీతంతో ఉద్యోగం కావాలా? ఇవి నేర్చుకోవాలంటున్న నిపుణులు.. చాలా ఈజీ.. మస్తు డబ్బు..

తక్కువ జీతం వస్తుందా? కొత్త జాబ్‌ కావాలా?

Jobs: భారీ జీతంతో ఉద్యోగం కావాలా? ఇవి నేర్చుకోవాలంటున్న నిపుణులు.. చాలా ఈజీ.. మస్తు డబ్బు..

Updated On : February 17, 2025 / 4:36 PM IST

హైదరాబాద్ సిటీ ఎంతో మందికి స్కిల్స్ నేర్పించి, ఉద్యోగం కూడా ఇస్తుంది. ఐటీ జాబ్ లకు కేంద్రంగా మారింది. గత రెండు దశాబ్దాలుగా ఐటీ రంగం విస్తరించడంతో, దాదాపు 10 లక్షల మంది ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే, వేగంగా పెరుగుతున్న టెక్నాలజీ కి అనుగుణంగా స్కిల్స్ కూడా పెంచుకోవడం ఎంతో ఆవశ్యకత ఉంది.

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎంటర్‌ప్రైజెస్ అసోసియేషన్ (హైసియా), కేపీఎంజీ సంయుక్తంగా నిర్వహించిన తాజా అధ్యయనం ప్రకారం.. ప్రస్తుతం యువతలో స్కిల్స్ ఎంత మేరకు ఉన్నాయంటే..?

  • తక్కువ స్కిల్స్ కలిగిన వారు – 19%
  • ఒక మోస్తరు స్కిల్స్ కలిగిన వారు – 55%
  • అధిక స్కిల్స్ కలిగిన వారు – 26%

ప్రాబ్లం సాల్వింగ్, అడ్వాన్స్‌డ్ అనలిటిక్స్ వంటి ప్రధాన స్కిల్స్ లో మెరుగుపడాల్సిన అవసరం ఉందని, అధిక నైపుణ్యాలు కలిగినవారు మొత్తం ఉద్యోగుల్లో 50% లోపే ఉన్నారని సర్వే పేర్కొంది. అలాగే ఏ స్కిల్స్ ఎంతమేరకు డిమాండ్ ని కలిగి ఉన్నాయో..టాప్ స్కిల్స్, న్యూ టెక్నాలజీస్ ఏంటో కూడా ఈ సర్వే పేర్కొంది.

Also Read: భూకంపం వచ్చి జనం భయంతో వణుకుతుంటే… వీళ్ల కామెడీ చూడండి..

ఏ స్కిల్స్.. ఎంతమేరకు డిమాండ్ అంటే..

  • 62% – రెగ్యులర్ టెక్ స్కిల్స్
  • 50% – క్లౌడ్ కంప్యూటింగ్
  • 49% – మిషన్ లెర్నింగ్ & ఇంజినీరింగ్
  • 47% – డేటా సైన్స్
  • 32% – ఇతరత్రా నైపుణ్యాలు
  • 27% – నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్
  • 24% – రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్
  • 20% – బీపీఓ నైపుణ్యాలు

టాప్ 10 స్కిల్స్

  • డేటా సైన్స్
  • ప్రొడక్ట్ డెవలప్‌మెంట్
  • క్లౌడ్ డెవలప్‌మెంట్
  • అప్లికేషన్ డెవలప్‌మెంట్
  • ఆటోమేషన్ ఆర్కిటెక్చర్
  • ఏఐ/ఎంఎల్ లెర్నింగ్
  • డేటా అనలిటిక్స్ & రిపోర్టింగ్
  • బిజినెస్ ఇంటెలిజెన్స్
  • సొల్యూషన్ ఆర్కిటెక్చర్
  • జెనరేటివ్ ఏఐ

న్యూ టెక్నాలజీస్ 

  • కృత్రిమ మేధ (AI) / మిషన్ లెర్నింగ్ (ML)
  • సొల్యూషన్ ఆర్కిటెక్చర్
  • క్లౌడ్ డెవలప్‌మెంట్
  • బిజినెస్ ఇంటెలిజెన్స్ (BI)
  • డేటా సైన్స్
  • జెనరేటివ్ AI

బిజినెస్‌ ఎక్స్పర్ట్స్ వెల్లడించిన అభిప్రాయాల ప్రకారం.. క్లౌడ్‌ కంప్యూటింగ్, మిషన్‌ లెర్నింగ్‌ నైపుణ్యాలకు డిమాండ్‌ ఎక్కువగా ఉందని, అత్యధికంగా 62 శాతంతో ‘రెగ్యులర్‌ టెక్‌ స్కిల్స్‌’కు డిమాండ్ ఉందని చెప్పారు. విద్యాసంస్థలు, కార్పొరేట్‌ సంస్థలు, ప్రభుత్వం సంయుక్తంగా ఉద్యోగార్థుల్లో నైపుణ్యాల పెంపునకు శిక్షణ ఇస్తున్నాయిని, ప్రత్యేకించి ఏఐ, ఎంఎల్, డేటా అనలిటిక్స్, సైబర్‌ సెక్యూరిటీ లపై దృష్టిపెట్టాలని, అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే న్యూ టెక్నాలజీస్ లపై పట్టు అవసరమని సూచిస్తున్నారు.