Faculty Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ
సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. కనీసం 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది.

Indian Institute of Technology
Faculty Recruitment : ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిపికేషన్ ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Recruitment of NABFID : ఎన్‌ఏబీఎఫ్‌ఐడీలో అనలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీ
విభాగాలు:
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, బయోమెడికల్ ఇంజినీరింగ్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్, బయోటెక్నాలజీ, లిబరల్ ఆర్ట్స్, కెమికల్ ఇంజినీరింగ్, మెటీరియల్స్ సైన్స్ అండ్ మెటలర్జికల్ ఇంజినీరింగ్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, సివిల్ ఇంజినీరింగ్, మెకానికల్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, డిజైన్ అండ్ ఏరోస్పేస్ ఇంజినీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్, డిజైన్ తదితర విభాగాలలో ఈ ఖాళీలు ఉన్నాయి.
READ ALSO : Sattu Pindi Benefits : బరువు తగ్గాలనుకునే వారికి ఈ పిండి సూపర్ ఫుడ్ !
అర్హతలు ;
అసిస్టెంట్ ప్రొఫెసర్ ; సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. కనీసం 3 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 35 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
READ ALSO : Sore Throat : గొంతు నొప్పితో బాధపడుతున్నారా ? ఈ నీరు గ్లాసు చాలు..
అసోసియేట్ ప్రొఫెసర్ ; సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. కనీసం 6 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి.వయోపరిమితి 45 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తుంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలపాటు వయోసడలింపునిస్తారు.
READ ALSO : Tomato Cultivation : టమాటలో బ్యాక్టీరియా ఆకుమచ్చ తెగులు నివారణ
ప్రొఫెసర్ ; సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ ఉత్తీర్ణతతో పాటు బోధన/ రిసెర్చ్ అనుభవం ఉండాలి. కనీసం 10 సంవత్సరాల టీచింగ్ అనుభవం ఉండాలి. వయోపరిమితి 55 సంవత్సరాలకు మించకూడదు. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు; ఓబీసీ (నాన్ క్రీమిలేయర్) అభ్యర్థులకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఎస్సీ, ఎస్టీ) 15 సంవత్సరాలు, దివ్యాంగులకు(ఓబీసీ) 13 సంవత్సరాలపాటు వయోసడలింపు ఉంటుంది.
READ ALSO : USA: పిల్లలు కలగడం లేదని డాక్టర్ వద్దకు వెళ్లిన మహిళ.. 34 ఏళ్లకు బయట పడిన మోసం
ఎంపిక విధానం, వేతనం ;
విద్యార్హత, పని అనుభవం, రిసెర్చ్, పబ్లికేషన్ రికార్డులు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు నెలకు రూ.98,200-రూ.1,01,500 చెల్లిస్తారు. అసోసియేట్ ప్రొఫెసర్ కు నెలకు నెలకు రూ.1,39,600 చెల్లిస్తారు. ప్రొఫెసర్ కు నెలకు రూ.1,59,100 చెల్లిస్తారు.
READ ALSO : Zimbabwe : దొంగ పాము.. కరెన్సీ నోట్లను ఎత్తుకెళ్తున్న పాము వీడియో వైరల్
దరఖాస్తు విధానం ;
అభ్యర్ధులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 13.11.2023.గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.iith.ac.in/careers/ పరిశీలించగలరు.