Job Notification : ఇండియన్ నేవీ మెగా జాబ్ నోటిఫికేషన్

అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 29న ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్‌ 5 చివరి తేదీగా నిర్ణయించారు.

Job Notification : ఇండియన్ నేవీ మెగా జాబ్ నోటిఫికేషన్

Indian Navy

Updated On : March 17, 2022 / 8:27 AM IST

Job Notification : ఇండియన్‌ నేవీ తాజాగా ఉద్యోగాల భర్తీకి మెగా నోటిఫికేషన్‌ జారీ చేసింది. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థ ఈ నోటిఫికేషన్ ద్వారా సెయిలర్‌ పోస్టుల భర్తీ చేపట్టనుంది. నోటిఫికేషన్‌లో మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలకు సంబంధించి ఆర్టిఫిషర్‌ అప్రెంటీస్‌ (ఏఏ) 500 ఖాళీలు, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌)2000 ఖాళీలు ఉన్నాయి.

ఆర్టిఫిషర్‌ అప్రెంటీస్‌(ఏఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియట్‌లో కనీసం 60 శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ,బయాలజీ,కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఉండాలి. అభ్యర్థులు 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌(ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు ఇంటర్మీడియెట్‌లో కనీసం 60శాతం మార్కులతో మ్యాథ్స్, ఫిజిక్స్‌తో పాటు కెమిస్ట్రీ,బయాలజీ,కంప్యూటర్‌ సైన్స్‌ ఉత్తీర్ణులై ఉండాలి. అభ్యర్థులు 2002 ఆగస్టు 1 నుంచి 2005 జులై 31 మధ్య జన్మించి ఉండాలి.

శిక్షణ సమయంలో నెలకు రూ. 14,600 స్టైపెండ్ గా అందజేస్తారు. అనంతరం రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు జీతం చెల్లిస్తారు. అభ్యర్థులను రాత పరీక్ష, ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఆగస్టు 2022 నుంచి శిక్షణ ఇస్తారు. ఏఆర్‌ అభ్యర్థులకు 9 నెలలు, ఎస్‌ఎస్‌ఆర్‌ వారికి 22 నెలల ట్రైనింగ్ ఉంటుంది.

అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ మార్చి 29న ప్రారంభమవుతుంది. దరఖాస్తులు స్వీకరణకు ఏప్రిల్‌ 5 చివరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://www.joinindiannavy.gov.in/ సంప్రదించగలరు.