తెలంగాణలో ఇంటర్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల

  • Published By: veegamteam ,Published On : May 12, 2019 / 12:40 PM IST
తెలంగాణలో ఇంటర్‌ ప్రవేశాల షెడ్యూల్‌ విడుదల

Updated On : May 12, 2019 / 12:40 PM IST

తెలంగాణలో ఇంటర్మీడియట్ ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు విడుదల చేసింది. జూనియర్ కళాశాలల్లో మొదటి విడత ప్రవేశాల కోసం మే 21 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కానుంది. జూన్ 1నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభించాలని బోర్డు నిర్ణయించింది. రెండో విడత ప్రవేశాల తేదీలను తర్వాత ప్రకటించనున్నట్టు బోర్డు కార్యదర్శి అశోక్‌ వెల్లడించారు. 

అనుమతులు లేని కాలేజీల్లో విద్యార్థులను చేర్చి ఇబ్బందులు పడవద్దని ఇంటర్‌ బోర్డు సూచించింది. అయితే ఒక్కో సెక్షన్‌లో 88 మందికి మించి చేర్చుకోకూడదని కళాశాలల యాజమాన్యాలకు సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. బోర్డు గుర్తింపు ఉన్న కళాశాలల్లోనే విద్యార్థులను చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేసింది. గుర్తింపు పొందిన కళాశాలల వివరాలన్నీ ఇంటర్‌ బోర్డు వెబ్‌సైట్‌లో లభ్యమవుతాయని బోర్డు కార్యదర్శి అశోక్‌ చెప్పారు.