ఏప్రిల్ 8 నుంచి.. 12 విడతల్లో JEE మెయిన్స్

జాతీయ స్థాయి ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో (BE/B-TECH) కోర్సుల్లో ప్రవేశానికి JEE మెయిన్స్–2019 పరీక్షలను ఏప్రిల్ 8 నుంచి 12 విడతల్లో నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్ణయించింది. (B.Arch/B.Planning) కోర్సుల్లో ప్రవేశాలకు ఏప్రిల్ 7న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. లోక్‌సభ ఎన్నికలు వచ్చే నెల 11, 18, 23, 29 తేదీల్లో, మే 6, 12, 19 తేదీల్లో నిర్వహించనున్నారు. జాయింట్ ఎంట్రన్స్ పరీక్షలో పేపర్ 1 (BE/B-TECH), పేపర్ 2 (B.Arch/B.Planning) అనే రెండు సెట్స్ ఉంటాయి.
అభ్యర్ధులు ఇంటర్మీడియట్, BSC కనీసం 75% మార్కులతో విద్యా అర్హత కలిగి ఉండాలి. అన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వాస్తవానికి ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 7 నుంచి 20వ తేదీ మధ్య పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. అయితే ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బందికి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కొత్త షెడ్యూల్ రిలీజ్ చేశారు.