Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉగ్యోగాలు.. రూ.30 వేలు జీతం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల(జూన్) 16న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

Job Mela: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హతతో ఉగ్యోగాలు.. రూ.30 వేలు జీతం

Job mela in gajuwaka

Updated On : June 13, 2025 / 10:40 AM IST

గాజువాకలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల(జూన్) 16న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. ఈమేరకు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాస్ అధికారిక ప్రకటన చేశారు. గాజువాక MVR డిగ్రీ & పీజీ కళాశాలలో ఈ మెగా జాబ్ జరుగనుంది. దాదాపు 20 ప్రముఖ కంపెనీలు సుమారు 1000 పైగా పోస్టుల భర్తీ చేసేందుకు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించనున్నాయి.

విద్యార్హతలు: టెన్త్, ఇంటర్, డిగ్రీ, బీటెక్, ఎంబీఏ, ఐటీఐ, డిప్లొమా, బి ఫార్మసీ, డి ఫార్మసీ, ఎం ఫార్మసీ పూర్తి చేసిన వారంతా ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చు.

జీతం వివరాలు: ఎంపికైన అభ్యర్థులకు అర్హత మేరకు రూ.10 వేల నుంచి రూ.30 వేల వేతనం ఉంటుంది.

జాబ్ లొకేషన్: విశాఖ, విజయనగరం, అనకాపల్లి, తుని ప్రాంతాల్లో జాబ్ చేయాల్సి ఉంటుంది.

వయోపరిమితి: ఈ ఇంటర్వ్యూ లకు హాజరయ్యే అభ్యర్థుల వయసు 18 నుంచి 35 ఏళ్ల మధ్యలో ఉండాలి.

ఇంటర్వ్యూలకు హారాజయ్యే విద్యార్థులు ముందుగా www.naipunyam.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని అడ్మిట్ కార్డు తీసుకోవాలి. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం ఉంది. ఇంకా ఏదైనా సందేహాలు ఉంటే 8790118349, 8712655686, 8555868681, 8790117279, 7893787028 ఈ హెల్ప్ లైన్ నంబర్స్ కి సంప్రదించవచ్చు.