Job Mela: టెన్త్ ఫెయిల్ అయ్యారా.. ఈ అవకాశం మీకోసమే.. రూ.20 వేలు జీతం.. ఇంకా చాలా ఉన్నాయి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది.

Job Mela: టెన్త్ ఫెయిల్ అయ్యారా.. ఈ అవకాశం మీకోసమే.. రూ.20 వేలు జీతం.. ఇంకా చాలా ఉన్నాయి

Job mela in ap

Updated On : June 12, 2025 / 3:31 PM IST

మీరు టెన్త్ ఫెయిల్ అయ్యారా? ఉద్యోగ అవకాశాలు లేక బాధపడుతున్నారా? అయితే ఈ అద్భుతమైన అవకాశం మీకోసమే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ, యువకులకు APSSDC ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ద్వారా జిల్లాల వారీగా పదవ తరగతి మొదలుకొని ఆపై చదువులు చదివి ఉద్యోగం కోసం ఎదురు చూసే వారికి ఉద్యోగ మేళాలు నిర్వహిస్తూ కొన్ని వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తోంది.

ఇందులో భాగంగానే కర్నూలు జిల్లా కేంద్రంలోని ఉపాధి కల్పన కార్యాలయంలో మినీ జాబ్ మేళా నిర్వహించనున్నారు. జూన్ 13వ తేదీన ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమం మొదలుకానుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి పి. సోమశివారెడ్డి అధికారిక ప్రకటనకే చేశారు. ఈ మినీ జాబ్ మేళాలో భాగంగా ముత్తూట్ ఫైనాన్స్, వోడాఫోన్ ఐడియా వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందుకోసం పదవ తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన వాళ్ళ నుంచి డిగ్రీ పూర్తి చేసుకున్న వారివరకు పాల్గొనవచ్చు. ఆయా కంపెనీల్లో ఉద్యోగం సాదించినవారికి నెలకు రూ.20 వేల జీతం అందనుంది.

కాబట్టి ఈ ఉద్యోగ మేళాను జిల్లాలోని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఉపాధికల్పనా అధికారి పి. సోమశివారెడ్డి కోరారు. ఇక ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యేవారు రెజ్యూమ్, విద్యార్హతా జిరాక్సులు, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలను తీసుకురావాలని, అభ్యర్థులు కేవలం ఫార్మల్ డ్రెస్ లోనే రావాలని, ముందస్తు రిజిస్ట్రేషన్ కోసం www.ncs.gov.in వెబ్ సైట్ ను సంప్రదించాలని కోరారు.