Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. అద్భుతమైన ఉగ్యోగ అవకాశాలు.. ఫుల్ డీటెయిల్స్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాలలో జులై 28న జాబ్ మేళా జరుగనుంది.

Job Mela: టెన్త్, ఇంటర్, డిగ్రీ పాసయ్యారా.. అద్భుతమైన ఉగ్యోగ అవకాశాలు.. ఫుల్ డీటెయిల్స్

JOb Mela in Andhra pradesh

Updated On : June 27, 2025 / 10:12 AM IST

ప్రస్తుతం కాలంలో చాలా మంది ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతున్నారు. చిన్న అవకాశం దొరికినా తమను తాము ప్రూవ్ చేసుకుందాం అని ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అలాంటి వారికోసమే అద్భుతమైన అవకాశం వచ్చింది. మీరు జస్ట్ టెన్త్, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసి ఉంటే చాలు. మంచి ప్రైవేట్ కంపెనీలలో అద్భుతమైన ఉద్యోగాలు, మంచి జీతం లభించనుంది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఉపాధి కల్పనలో భాగంగా పార్వతిపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలోని శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాలలో జులై 28న జాబ్ మేళా జరుగనుంది. ఈ మేరకు పార్వతిపురం మన్యం జిల్లా కలెక్టర్ శ్యాంప్రసాద్ అధికారిక ప్రకటన చేశారు. నిరుద్యోగ యువతీ యువకులు ఇది గొప్ప అవకాశమని ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. ఈ జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలని తెలియజేశారు.

ఎలాంటి రాత పరీక్షలు లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ద్వారానే అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఈ జాబ్ మేళా జూన్ 28న ఉదయం 9 గంటలకు సాలూరు శ్రీ సత్య సాయి డిగ్రీ కళాశాలలో జరుగనుంది. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ https://naipunyam.ap.gov.in తప్పనిసరిగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక జాబ్ మేళాకు వచ్చేవారు తమ బయోడేటా, ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్ సైజు రెండు ఫోటోలను తీసుకొని రావాలి. మరిన్ని వివరాల కోసం, ఏదైనా సందేహాల కోసం టోల్ ఫ్రీ నంబర్ 94947 77553, 73825 590223 లకు సంప్రదించాలని కోరారు.