CRIS Recruitment 2022: న్యూదిల్లీ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో ఉద్యోగాల భర్తీ

: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న CRIS లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం

CRIS Recruitment 2022: న్యూదిల్లీ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో ఉద్యోగాల భర్తీ

Processed With Vsco With K3 Preset

Updated On : April 18, 2022 / 12:42 PM IST

CRIS Recruitment 2022 : భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 150 ఖాళీలను భర్తీ చస్తున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు. కంప్యూటర్ సైన్స్, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్టాటిస్టిక్స్, విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. పోస్టుల వివరాలకు సంబంధించి అసిస్టెంట్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు 144, అసిస్టెంట్ డేటా అనలిస్టులు 6 ఖాళీలు ఉన్నాయి.

అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి గేట్ 2022 మెరిట్ స్కోర్ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 25, 2022 నుండి ప్రారంభం అవుతుంది. దరఖస్తులకు చివరి తేది మే 24, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://cris.org.in పరిశీలించగలరు.