HSL : విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ లో ఉద్యోగాల భర్తీ

హెచ్ ఆర్, ఫైనాన్స్, టెక్నికల్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు.

HSL : విశాఖపట్నం హెచ్ ఎస్ ఎల్ లో ఉద్యోగాల భర్తీ

Hsl Vizac

Updated On : March 3, 2022 / 8:54 AM IST

HSL : విశాఖపట్నంలోని హిందుస్ధాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో పోస్టుల భర్తీని నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 పోస్టులు భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్ ప్రాజెక్ట్ ఆఫీసర్, డిప్యూటీ ప్రాజెక్ట్ ఆఫీసర్ తదితరాలు ఉన్నాయి.

హెచ్ ఆర్, ఫైనాన్స్, టెక్నికల్, కమర్షియల్, సివిల్, అడ్మినిస్ట్రేషన్ తదితర విభాగాల్లో ఆయా పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో డిప్లొమా, గ్రాడ్యుయేషన్ , బీఈ, బీటెక్, ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దానితోపాటుగా పనిలో అనుభవం కలిగి ఉండాలి.

ఎంపిక విధానం విషయానికి వస్తే షార్ట్ లిస్టింగ్, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో పంపాల్సి ఉంటుంది. ఆన్ లైన్ దరఖాస్తులు పంపేందుకు మార్చి 30, 2022 నుండి ఏప్రిల్ 20 వరకు గడువు విధించాలరు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ www.hslvizag.in సంప్రదించగలరు.