అప్లై చేసుకోండి: LICలో 8500 ఉద్యోగాలు

ముంబయి ప్రధాన కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (LIC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల కోసం అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తిగల అభ్యర్ధులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్, ఎగ్జామ్, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.
వయస్సు: 18 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీలకు వయస్సు నిబంధనల్లో సడలింపు.
ముఖ్యమైన తేదిలు:
దరఖాస్తు ప్రారంభం: సెప్టెంబర్ 17, 2019.
దరఖాస్తు చివరితేది: అక్టోబర్ 1, 2019.
ప్రిలిమినరీ పరీక్ష: అక్టోబర్ 21, 22 తేదీల్లో.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
Read Also : అప్లయ్ చేశారా? : ఆర్మీ పబ్లిక్ స్కూల్లో 8వేల టీచర్ పోస్టులు