Notification : ఏపిలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక విధానం ఉంటుంది.
Notification : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ రాష్ట్రంలో ఒప్పంద ప్రాతిపదికన మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 3393 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు.
జోన్ల వారిగా ఖాళీల వివరాలకు సంబంధించి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం 633 ఖాళీలు, ఈస్ట్ గోదావరి, వెస్ట్‌గోదావరి, కృష్ణా1003 ఖాళీలు, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు786 ఖాళీలు, చిత్తూరు, కడప, అనంతపూర్, కర్నూలు971 ఖాళీలు ఉన్నాయి. పోస్టుల విద్యార్హత విషయానికి వస్తే, ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బీఎస్సీ నర్సింగ్ పూర్తిచేసి ఉండాలి. దాంతోపాటు ఏపీ నర్సింగ్ కౌన్సిల్లో రిజిస్టర్ అయి ఉండాలి. బీఎస్సీ నర్సింగ్‌లో కమ్యూనిటీ హెల్త్ సర్టిఫికెట్ ప్రోగ్రామ్ పూర్తి చేసి ఉండాలి.
దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థుల వయసు 35ఏళ్లు మించకూడదు. బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థుల వయసు 40ఏళ్లు మించకూడదు. అకడెమిక్ మెరిట్ మార్కుల ఆధారంగా తుది ఎంపిక విధానం ఉంటుంది. అభ్యర్ధులు తమ ధరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. ధరఖాస్తులకు చివరి తేది 06.11.2021గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ https://cfw.ap.nic.in/MLHP2021.htmlసంప్రదించాలి.