AP EAPCET 2025: గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరేందుకు ఏ ప్రవేశ పరీక్ష ఎప్పుడు?

పరీక్షలు రాసేందుకు వెళ్లే వారు తప్పనిసరిగా హాల్‌టికెట్‌, ఏదైనా ఒరిజినల్‌ ఐడీని తీసుకెళ్లాలి.

AP EAPCET 2025: గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరేందుకు ఏ ప్రవేశ పరీక్ష ఎప్పుడు?

Updated On : May 3, 2025 / 9:21 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో వివిధ కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్షల తేదీలను ఏపీ ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ఈ పరీక్షల ద్వారా గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్‌ కోర్సుల్లో చేరవచ్చు. పరీక్షలకు నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను ఎగ్జామ్స్‌ సెంటర్లలోకి అనుమతించరు.

పరీక్షలు రాసేందుకు వెళ్లే వారు తప్పనిసరిగా హాల్‌టికెట్‌, ఏదైనా ఒరిజినల్‌ ఐడీని తీసుకెళ్లాలి. AP EAPCETకు ఇప్పటివరకు 3.60 లక్షల దరఖాస్తులు అందాయి. బయోమెట్రిక్‌ నమోదు కోసం ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు అభ్యర్థులు ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే చేతులకు మెహందీ, సిరా వంటివి ఉండొద్దు. ఎగ్జామ్‌ సెంటర్లలోకి ఎలక్ట్రానిక్‌ గాడ్జెట్లను అనుమతివ్వరు. ఎగ్జామ్‌ వేళ వాడే చిత్తు కాగితాలను కూడా ఇన్విజిలేటర్లకు ఇవ్వాల్సిందే.

Also Read: ఏపీ లిక్కర్ స్కాంలో మరిన్ని అరెస్టులు? ఇప్పటివరకు ఓ లెక్క… ఇప్పుడో లెక్క

ఏ ప్రవేశ పరీక్ష ఎప్పుడు?

  • ECET – మే 6
  • ICET – మే 7
  • EAPCET (వ్యవసాయ, ఫార్మసీ) –   మే 19, 20
  • EAPCET (ఇంజినీరింగ్) – మే 21 నుంచి మే 24,  మే 26 నుంచి మే 27 వరకు
  • LAWCET & PGLCET – 5 జూన్ 2025
  • Ed.CET –  జూన్ 6 నుంచి 8 వరకు
  • PGECET –  జూన్ 9 నుంచి 13 వరకు