ONGC Scholarship : ఓఎన్జీసీ 2023-24 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
మెరిట్-ఆధారితంగా స్కాలర్‌షిప్ కు ఎంపిక జరుగుతుంది. తుది ఎంపిక కోసం అకడమిక్ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా MBBS ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నట్లయితే, 12వ తరగతి పరీక్షలో అభ్యర్థి ఉత్తీర్ణత అధారంగా ఎంపిక చేస్తారు.

ongc scholarship
ONGC Scholarship : ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ONGC) 2023-24 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలను అందించనుంది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను సంస్ధ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Eatala Rajender : కేసీఆర్‌కు బుద్ది చెప్పేందుకే గజ్వేల్‌లోనూ పోటీ : ఈటల రాజేందర్
ఇంజనీరింగ్, MBBS, MBA లేదా జియోఫిజిక్స్/జియాలజీ ప్రోగ్రామ్‌లో మాస్టర్స్ మొదటి సంవత్సరం చదువుతున్న SC/ST/OBC మరియు జనరల్ వర్గాలకు చెందిన విద్యార్థుల ఈ ప్రత్యేకమైన స్కాలర్‌షిప్ కు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ONGC (ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ) లిమిటెడ్ CSR కింద, ఈ స్కాలర్‌షిప్ లను ప్రతి ఏటా అందిస్తుంది. ఈ సంవత్సరం 2000 ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కాలర్ షిప్ లను అందజేయనుంది. నిర్దేశిత కోర్సులను అభ్యసిస్తున్న భారతీయ విద్యార్థులు ONGC స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవటానికి అర్హులు. మొత్తం స్కాలర్‌షిప్‌లలో 50% మహిళా అభ్యర్థులకు రిజర్వ్ చేశారు.
READ ALSO : Heart Attack Cases : కొవిడ్ రోగులకు గుండెపోటు ఎందుకు వస్తుందంటే…ఐసీఎంఆర్ పరిశోధనల్లో తేలిన నిజం
ఏరాష్ట్రాలకు చెందిన విద్యార్ధులు అర్హులంటే ;
నార్త్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ; చండీగఢ్, ఢిల్లీ, జమ్మూ & కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, హర్యానా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్
వెస్ట్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ; గుజరాత్, మహారాష్ట్ర, రాజస్థాన్, గోవా, మధ్యప్రదేశ్, దాదర్ & నగర్ హవేలీ, డామన్ & డయ్యూ
ఈశాన్య జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ; అస్సాం, మిజోరం, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్
ఈస్ట్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ; బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్
సౌత్ జోన్ పరిధిలోకి వచ్చే రాష్ట్రాలు ; కేరళ, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, అండమాన్ & నికోబార్ దీవులు, లక్షద్వీప్
READ ALSO : PM Narendra Modi : గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన, అంబాజీ దేవాలయంలో ప్రత్యేక పూజలు
దరఖాస్తు చేసే విధానం ;
అర్హతగల విద్యార్థులు దిగువ పేర్కొన్న దశల వారీ విధానాన్ని అనుసరించడం ద్వారా దరఖాస్తులను సమర్పించాలి –
స్టెప్ 1: ONGC స్కాలర్‌షిప్ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
స్టెప్ 2: అప్లికేషన్‌ను ఓపెన్ అయిన తరువాత అప్లై స్కాలర్‌షిప్ బటన్‌పై క్లిక్ చేయాలి.
స్టెప్ 3: దరఖాస్తు ఫారమ్‌లో అవసరమైన అన్ని వివరాలను పూరించాలి. (గమనిక: విద్యార్థులు దరఖాస్తు ఫారమ్‌ను పెద్ద అక్షరాలతో నింపాలి).
స్టెప్ 4: పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అన్ని డాక్యుమెంట్‌లను అప్‌లోడ్ చేయాలి.
స్టెప్ 5: అలాగే, దానికి సంబంధించిన హార్డ్ కాపీలను డౌన్ లోడ్ చేసుకుని ముందుగా సూచించిన విధంగా సంబంధిత జోన్‌లోని ONGC కార్యాలయానికి చేరేలా పంపాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఎక్కడ నుండి దరఖాస్తు చేసుకోగలరో జోన్ అనేది అభ్యర్థి యొక్క కళాశాల/ఇన్‌స్టిట్యూట్/యూనివర్శిటీ అర్హత పరీక్ష యొక్క స్థానం ఆధారంగా నిర్ణయించబడుతుంది.
READ ALSO : Amla Fruit Juice : శీతాకాలంలో ఇన్ఫెక్షన్ల పై పోరాడటంతోపాటు, రోగనిరోధక శక్తిని పెంచే ఉసిరి కాయ రసం !
పూర్తి చేసిన దరఖాస్తులను పంపాల్సిన జోన్ కార్యాలయల చిరునామాలు ;
నార్త్ జోన్ చీఫ్ మేనేజర్ (HR),రిజర్వేషన్ సెల్, గ్రీన్ హిల్స్, A-వింగ్, గ్రౌండ్ ఫ్లోర్, ONGC, టెల్ భవన్, డెహ్రాడూన్ – 248003
వెస్ట్ జోన్ GM (HR),ONGC, NBP గ్రీన్ హైట్స్, ప్లాట్ నెం. C-69, బాంద్రా కుర్లా కాంప్లెక్స్, బాంద్రా (E),ముంబై – 400051
నార్త్-ఈస్ట్ జోన్ ఇంఛార్జ్ HR/ER, SVS, ONGC, అస్సాం అసెట్, సెంట్రల్ వర్క్‌షాప్, 2వ అంతస్తు, B.G. త్రోవ, శివసాగర్ – 785640, అస్సాం
ఈస్ట్ జోన్ ఇంఛార్జ్ HR/ER MBA బేసిన్, ONGC, 50 – J.L. నెహ్రూ రోడ్,కోల్‌కతా – 700071
సౌత్ జోన్ ఇంఛార్జ్ HR/ER, ONGC, 7వ అంతస్తు, ఈస్ట్ వింగ్, CMDA టవర్ – I, గాంధీ ఇర్విన్ రోడ్, ఎగ్మోర్, చెన్నై – 600008
READ ALSO : Custard Apple : శీతాకాలం సీజన్‌లో సీతాఫలం తినటం వల్ల కలిగే ప్రయోజనాలు !
స్కాలర్ షిప్ లకు ఎంపిక విధానం ;
మెరిట్-ఆధారితంగా స్కాలర్‌షిప్ కు ఎంపిక జరుగుతుంది. తుది ఎంపిక కోసం అకడమిక్ మెరిట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. అభ్యర్థులు ఇంజనీరింగ్ లేదా MBBS ప్రోగ్రామ్‌ను అభ్యసిస్తున్నట్లయితే, 12వ తరగతి పరీక్షలో అభ్యర్థి ఉత్తీర్ణత అధారంగా ఎంపిక చేస్తారు. అయితే, దరఖాస్తుదారులు జియాలజీ లేదా జియోఫిజిక్స్‌లో MBA లేదా మాస్టర్స్ కోర్సును అభ్యసిస్తున్నట్లయితే, గ్రాడ్యుయేషన్ స్థాయిలో దరఖాస్తుదారు యొక్క పనితీరు ఆధారంగా ఎంపిక ఉంటుంది. అర్హత పరీక్షలో సమాన మార్కులు ఉన్న విద్యార్థుల విషయంలో, ఆదాయం తక్కువ ఉన్న విద్యార్థులను ఎంపిక చేస్తారు. BPL (దారిద్య్ర రేఖకు దిగువన) కుటుంబాల నుండి విద్యార్థులకు ప్రాధాన్యత ఇస్తారు. BPL కుటుంబాల నుండి తగినంత సంఖ్యలో విద్యార్థులు అందుబాటులో లేకుంటే మాత్రమే ఇతర విద్యార్థులను ఎంపిక చేస్తారు.
READ ALSO : Kerala Bomb Blast : ఢిల్లీ, ముంబయితోపాటు దేశవ్యాప్తంగా హై అలర్ట్
ONGC స్కాలర్‌షిప్ నిబంధనలు, షరతుల ప్రకారం దరఖాస్తు చేసుకోవాలనుకునే విద్యార్థులు మరే ఇతర స్కాలర్‌షిప్ లకు సంబంధించిన ఆర్థిక సహాయం పొందకుండా ఉండాలి. ప్రతి సంవత్సరం స్కాలర్‌షిప్ కొనసాగాలంటే వార్షిక పరీక్షలో మంచి ప్రతిభ కనబరచాలి. స్కాలర్‌షిప్ కొనసాగాలంటే వారి వ్యక్తిగత క్రమశిక్షన పరిగణనలోకి తీసుకుంటారు. విద్యార్థులు కనీసం 50% మార్కులు లేదా 10కి 5 గ్రేడ్ పాయింట్ల స్కేల్ కలిగి ఉండాలి. దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరు తేదిగా 30-11-23 గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://ongcscholar.org/పరిశీలించగలరు.