ఆపరేషన్ స్మైల్ : బాల కార్మికుల ఆపన్న హస్తం

తెలంగాణ రాష్ట్రంలో వెట్టి చాకిరిలో మగ్గిపోతున్న చిన్నారులను కాపాడేందుకు.. వారి ముఖంలో చిరునవ్వును తిరిగితేవాలన్న సంకల్పంతో చేపడుతోన్న ఆపరేషన్ స్మైల్ సత్ఫలితాలను ఇస్తోంది. ప్రతి ఏటా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్ పేరిట పోలీసులు చేపడుతున్న దాడుల్లో వేలాది మంది చిన్నారులకు విముక్తి కలిగుతోంది.కొత్త సంవత్సరం 2020 ప్రారంభం నుంచి చేసే దాడుల్లో దాడుల్లో గుర్తించిన పిల్లల్లో దళిత, గిరిజనులు ఉంటే యజమానులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా పెట్టేందుకు పోలీసులు సిధ్దమయ్యారు.
2020 మొత్తం వెట్టిచాకిరి, పిల్లల అక్రమ రవాణాపై నిఘా ఉంచాలని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్ని జిల్లాల పోలీసులకు సూచించారు.రాష్ట్రంలో తప్పిపోయిన చిన్నారులు, బాలికల వివరాలను సేకరించి వారి ఫొటోలతో పోలీసులు ఆల్బమ్‌ను రూపొందించనున్నారు.
ఈ వివరాలతో ప్రత్యేక టీమ్‌లు రాష్ట్రంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, జనసమ్మర్థం ఉన్న జంక్షన్లు, చౌరస్తాలను తనిఖీ చేస్తాయి. దీనికిగాను ప్రతీ సబ్ డివిజన్‌లో ఒక ఎస్‌ఐ, నలుగురు పోలీస్ కానిస్టేబుళ్లు కలిగిన ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేశారు. ప్రతీ టీమ్‌లో ఒక మహిళా సిబ్బంది కూడా ఉంటారు.