Assam Rifles Recruitment : అస్సాం రైఫిల్స్‌లో గ్రూప్-బి, గ్రూప్-సి ఖాళీల భర్తీ

అభ్యర్ధుల వయోపరిమితి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

Assam Rifles Recruitment : అస్సాం రైఫిల్స్‌లో  గ్రూప్-బి, గ్రూప్-సి ఖాళీల భర్తీ

Recruitment 2023

Updated On : October 21, 2023 / 12:16 PM IST

Assam Rifles Recruitment : షిల్లాంగ్‌లోని అస్సాం రైఫిల్స్ లో పలు ఉద్యోగ ఖాళీల భర్తీ చేపట్టనుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 161 ఖాళీలను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న ఖాళీలలో గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లో టెక్నికల్, ట్రేడ్స్‌మ్యాన్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. దీనికిసంబంధించి డిసెంబరు నెలలో రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.

READ ALSO : Boyapati Srinu : పవన్ కళ్యాణ్‌పై డైరెక్టర్ బోయపాటి ఆసక్తికర వ్యాఖ్యలు.. ఏమన్నారో తెలుసా?

ఖాళీల వివరాలకు సంబంధించి బ్రిడ్జి అండ్ రోడ్ (మెన్, ఉమెన్): 26, రిలీజియస్ టీచర్ (మెన్): 04, ఎలక్ట్రికల్ & మెకానికల్: 30, పర్సనల్ అసిస్టెంట్ (మెన్, ఉమెన్): 14, లైన్‌మ్యాన్ ఫీల్డ్(మెన్): 19 , రికవరీ వెహికిల్ మెకానిక్: 24, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెన్, ఉమెన్): 12, ప్లంబర్: 14, సర్వే ఐటీఐ: 04, ఎక్స్-రే అసిస్టెంట్: 14 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి పోస్టును బట్టి పదోతరగతి, 10+2, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.

READ ALSO : Hair Loss : జుట్టు రాలడానికి కారణాలు, చికిత్స, నివారణ !

అభ్యర్ధుల వయోపరిమితి 18-23 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజుగా గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100 గా నిర్ణయించారు. ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

READ ALSO : Tulsi Seeds : శరీరంలో అధిక వేడి ఉష్ణోగ్రతను తగ్గించటంతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందించే తులసి గింజలు !

దరఖాస్తులను ఆన్ లైన్ విధానంలో పంపాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేదీ 19.11.2023గా నిర్ణయించారు. రిక్రూట్ మెంట్ ర్యాలీ 18.12.2023 నుండి ప్రారంభమౌతుంది. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://www.assamrifles.gov.in/ పరిశీలించగలరు.