Faculty Posts : తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టులు భర్తీ

Faculty Posts : తెలంగాణ మెడికల్ కాలేజీల్లో ఒప్పంద ప్రాతిపదికన టీచింగ్ పోస్టులు  భర్తీ

Faculty Posts

Updated On : October 8, 2023 / 12:19 PM IST

Faculty Posts : తెలంగాణలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రుల్లో ఒప్పంద ప్రాతిపదిక టీచింగ్ పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈనోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ వైద్యకళాశాలల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ కార్యాలయం కాంట్రాక్టు విధానంలో కేవలం ఏడాది కోసం తీసుకుంటున్నారు. ఏడాది తర్వాత అవసరాన్ని బట్టి పదవీ కాలాన్నిపొడిగిస్తారు.

READ ALSO : Healthy Snacks : భోజనానికి ముందు ఆకలి వేస్తుందా? ఆకలిని నియంత్రించే ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇవే ?

భర్తీ చేయనున్న పోస్టుల్లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌ ప్రొఫెసర్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీలు ఉన్నాయి. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫాథాలజీ, మైక్రోబయాలజీ, ఫోరెన్సిక్‌ మెడిసిన్‌, కమ్యూనిటీ మెడిసిన్‌ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. వికారాబాద్, జనగామ, కరీంనగర్, కుమ్రంభీం ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, నిర్మల్, ఖమ్మం, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల మెడికల్ కళాశాలల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు.

READ ALSO : Protect Heart Health : మధుమేహాం సమస్యతో బాధపడుతున్న వారు గుండె ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏంచేయాలంటే !

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతల విషయానికి వస్తే సంబంధిత విభాగంలో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణతతో పాటు బోధన, రిసెర్చ్ అనుభవం కలిగి ఉండాలి. వయోపరిమితి 69 సంవత్సరాలకు మించరాదు. పీజీ మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ ఆధారంగా అభ్యర్ధుల ఎంపిక ఉంటుంది. ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు రూ.1.25 లక్షలు చెల్లిస్తారు. అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ విభాగాలకు అదనంగా మరో రూ.50,000 అందజేస్తారు.

READ ALSO : United Kingdom : మహిళకు క్యాన్సర్ నుంచి విముక్తి.. డాక్టర్లు ఇచ్చిన వండర్ డ్రగ్ ఏంటంటే?

అభ్యర్థులు దరఖాస్తుతోపాటు, తమ ధ్రువపత్రాలను స్కాన్‌ చేసి ఈ మెయిల్‌ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపాల్సిన E-Mail: dmerecruitment.contract@gmail.com. దరఖాస్తు సమర్పణకు చివరితేది: 15.10.2023గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://dme.telangana.gov.in/