Replacement : ఈసీఎల్ లో 313 పోస్టుల భర్తీ

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలి. దీనితోపాటు మైనింగ్ సర్టిఫికేట్ తో పాటుగా గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు ఉండాలి.

Replacement : ఈసీఎల్ లో 313 పోస్టుల భర్తీ

Ecl

Updated On : February 20, 2022 / 6:59 PM IST

Replacement : కోల్ ఇండియా సంస్ధకు అనుబంధ సంస్ధ అయిన ఈస్ట్రర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 313 మైనింగ్ సర్ధార్ పోస్టులను భర్తీ చేయనున్నారు. భర్తీ చేయనున్న పోస్టులకు సంబంధించి జనరల్ క్యాటగిరిలో 27 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ 30, ఓబీసి 83, ఎస్సీ 46, ఎస్టీ 23 ఖాళీలు ఉన్నాయి.

పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఇంటర్ విద్యార్హత కలిగి ఉండాలి. దీనితోపాటు మైనింగ్ సర్టిఫికేట్ తో పాటుగా గ్యాస్ టెస్టింగ్, ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్ధులు తమ దరఖాస్తులను అన్ లైన్ లో పంపాల్సి ఉంటుంది. రాతపరీక్ష అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదిగా మార్చి 10, 2022గా నిర్ణయించారు. పూర్తి వివరాలకు easterncoal.gov.in సంప్రదించగలరు.